- November 5, 2021
Balakrishna: అర్దరాత్రి కారులో అమ్మాయితో బాలకృష్ణ.. చేజ్ చేసి పట్టుకున్న మోహన్ బాబు!

Balakrishna నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు మధ్య ఇది వరకు ఎలాంటి సంబంధాలున్నాయో ఎవ్వరికీ తెలియదు. కానీ మొన్నటి మా ఎన్నికల నేపథ్యంలో మాత్రం అవి ఇంకా ధృడంగా మారాయి. స్వర్గీయ ఎన్టీ రామారావు పక్కనే ఉంటూ మోహన్ బాబు ఆ సమయంలో తోడు నీడగా ఉండేవాడు. ఎన్టీఆర్ సినీ, రాజకీయ అంశాల్లో మోహన్ బాబు పాత్ర ఉంటుంది. చివరగా ఎన్టీఆర్‌ను ఒప్పించి.. పట్టుబట్టి మరీ మేజర్ చంద్రకాంత్ సినిమాను తీశాడు మోహన్ బాబు.
అలా నందమూరి వంశంతో మోహన్ బాబుకు మంచి బంధాలే ఉన్నాయి. అయితే చంద్రబాబు వల్ల టీడీపీకి దూరమయ్యాడు మోహన్ బాబు. తాజాగా బాలయ్య,మోహన్ బాబు కలిసి ఆహా షోకి వచ్చారు. అన్ స్టాపబుల్ అంటూ బాలయ్య నడిపిస్తున్న ఈ టాక్ షోలో మంచు ఫ్యామిలీ మొదటి గెస్టుగా వచ్చింది. మోహన్ బాబు బాలయ్య పెట్టుకున్న ముచ్చట్లు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇందులో మందు చిందులు గురించి కూడా ముచ్చటించారు. మ్యాన్షన్ హౌస్ నా బ్రాండ్ అని అందరికీ తెలుసు అని బాలయ్య నిర్మోహమాటంగా చెప్పేశాడు. తాను కూడా అప్పుడప్పుడు విస్కీ తాగుతాను అని మోహన్ బాబు అన్నాడు.
ఇక ఓ విషయం గురించి బాలయ్యను అడిగేశాడు మోహన్ బాబు. ఓ సారి ఎయిర్ పోర్ట్ దారిలో నేను వెళ్తున్నాను. నా పక్క నుంచి ఎవరో వేగంగా వెళ్లారు. నా డ్రైవర్‌కు చెప్పి ఓవర్ టేక్ చేయమన్నాను. మొత్తానికి ఆ కారు ముందుకు వెళ్లి ఆపాడు. ఆ కారులో ఉన్నది నువ్వే. పక్కనే వేరే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఎవరు? మన ఇంటి ఆడపిల్ల అయితే కాదు అని మోహన్ బాబు అడిగేశాడు.
అయితే దీనికి ఏ మాత్రం బాలయ్య ఆలోచించలేదు. అవును అమ్మాయి ఉంది.. ఏదైనా లిఫ్ట్ కావొచ్చు.. ఇంకేదైనా కావొచ్చు.. నేను ప్రజా ప్రతినిధిని అందరికీ సేవా చేస్తాను అంటూ బాలయ్య కవర్ చేసేశాడు. కానీ అది ఎవరు? అనే విషయాన్ని మాత్రం బయటకు చెప్పలేదు.