• August 26, 2024

కృష్ణాష్టమి సందర్భంగా ‘కన్నప్ప’ నుంచి అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన మోహన్ బాబు

కృష్ణాష్టమి సందర్భంగా ‘కన్నప్ప’ నుంచి అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన మోహన్ బాబు

    విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం రాబోతోంది. ఇప్పటికే కన్నప్ప మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్‌తో ఒక్కసారిగా కన్నప్ప టీం హైప్ పెంచేసింది. ఇక ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ ఇస్తున్న అప్డేట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో కృష్ణాష్టమి సందర్భంగా సోమవారం నాడు స్పెషల్ కారెక్టర్‌ను పోషించిన మంచు వారి మూడో తరం నుంచి అవ్రామ్ భక్త మంచు లుక్‌ను రిలీజ్ చేశారు.

    విష్ణు మంచు తనయుడు అవ్రామ్ భక్త మంచు కన్నప్ప సినిమాతో తెరపైకి ఎంట్రీ ఇస్తున్నారు. కన్నప్పలో అవ్రామ్ కారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను డా.మంచు మోహన్ బాబు రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్‌లో అవ్రామ్ ఎంతో పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్‌లో కాళీ మాత విగ్రహం డిజైన్ కూడా అదిరిపోయింది. తిన్నడు బాల్యానికి సంబంధించిన లుక్‌లో అవ్రామ్ కనిపించబోతున్నాడు.

    విష్ణు మంచు టైటిల్ రోల్‌లో కనిపించనున్న కన్నప్ప అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. డిసెంబర్‌లో ఈ సినిమా పాన్‌ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.