• November 5, 2021

చిరంజీవిని పొగిడాడా? కించపరిచాడా?.. మోహన్ బాబు కామెంట్స్ వైరల్

చిరంజీవిని పొగిడాడా? కించపరిచాడా?.. మోహన్ బాబు కామెంట్స్ వైరల్

    చిరంజీవి మోహన్ బాబు మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో చెప్పడం కష్టం. ఒక్కోసారి ఆప్త మిత్రుల్లా అనిపిస్తుంటారు. ఇంకోసారి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అయితే మొన్న జరిగిన మా ఎన్నికల్లో మెగా మంచు వారి మధ్య దూరం పెరిగింది. చిరంజీవి చెప్పినా కూడా మోహన్ బాబు వినకుండా.. తన కొడుకు మంచు విష్ణును బరిలోకి దించాడు. అలా మెగా మంచు వారి మధ్య ఈ ఎన్నికలు బాగానే దూరాన్ని పెంచాయి.

    ఆ ఎన్నికల్లో నందమూరి, మంచు వారి మధ్య బంధం మరింత గట్టిగా మారింది. బాలయ్యతో మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి బాగానే హల్చల్ చేశారు. అయితే తాజాగా ఆహాతో అన్ స్టాపబుల్ టాక్ షోలో బాలయ్య దుమ్ములేపేశాడు. బాలయ్య చేస్తోన్న టాక్ షోలో.. మొదటి గెస్టుగా మోహన్ బాబు వచ్చేశాడు. ఇందులో భాగంగా ఎన్నో విషయాల మీద స్పందించాడు. అందులో భాగంగా చిరంజీవికి సంబంధించిన ప్రశ్నలను మోహన్ బాబు ముందు ఉంచాడు బాలయ్య.

    చిరంజీవి మీద నిజంగా ఉన్న అభిప్రాయం ఏంటి? అని మోహన్ బాబును బాలయ్య అడిగేశాడు. దీంతో మోహన్ బాబు తన మనసులోని మాట చెప్పేశాడు. ఆయనంటే నాకు దురభిప్రాయం ఏమీ లేదు.. చెడు అభిప్రాయం లేదు.. ఆయన మంచి నటుడు, మంచి డ్యాన్సర్. కలిసి ఎన్నో సినిమాలు చేశాం. పైగా మా అల్లు రామలింగయ్య గారి అల్లుడు.. మా సురేఖా అంటే మా ఇంటి పిల్లలను పెళ్లి చేసుకున్నాడు.. కాబట్టే బాగున్నాడు అంటూ మోహన్ బాబు చెప్పేశాడు.

    అయితే మోహన్ బాబు ఉద్దేశ్యం మాత్రం వేరేలా ఉందని అనిపిస్తోంది. అల్లు ఫ్యామిలీకి అల్లుడు అయ్యాడు కాబట్టే ఈ స్థాయికి వచ్చాడు.. వారి అండదండలతోనే ఎదిగాడు అనేట్టుగా మోహన్ బాబు చెప్పినట్టు కనిపిస్తోంది. మొత్తానికి మోహన్ బాబు చెప్పిన కామెంట్లు మాత్రం ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేస్తున్నాయి. ఇక మరో అల్లు ఫ్యామిలీ కూడా మెగా కుటుంబానికి అంటీ అంటన్నట్టుగా ఉన్నట్టు కనిపిస్తోంది. అల్లు, నందమూరి, మంచు ఇలా ఆహా పేరిట ఇప్పుడు అంతా ఒక్కటైనట్టు కనిపిస్తోంది.

    Leave a Reply