• October 24, 2021

Lasya-Ariyana: ఇలియానా అనుకుంటున్నావా?.. అరియానా పరువుతీసిన లాస్య

Lasya-Ariyana: ఇలియానా అనుకుంటున్నావా?.. అరియానా పరువుతీసిన లాస్య

    Lasya-Ariyana బిగ్ బాస్ షో ద్వారా చాలా మంది ఫేమస్ అవుతుంటారు. అయితే కొంత మంది మాత్రం నెగెటెవిటీ మూట గట్టుకుని ఎవ్వరికీ కనిపించుకుండాపోతారు. వచ్చిన క్రేజ్‌ను ఎలా వాడుకోవాలో తెలియక ఇంకొందరు కాలాన్ని వృథా చేసుకుంటారు. అలా బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో అన్ని రకాల కేటగిరీల వాళ్లున్నారు. అభిజిత్ తనకు వచ్చిన ఫాలోయింగ్, క్రేజ్‌ను నిలబెట్టుకోలేకపోతోన్నాడు. ఫ్యాన్స్‌తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడు.

    కానీ మిగతా వాళ్లంతా మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలోనే పడి ఉంటారు. ఏదైనా పండుగ ఈవెంట్, స్పెషల్ ఈవెంట్ ఉంటే వాలిపోతారు. అలా అరియానా, సోహెల్, అఖిల్, లాస్య, హారిక వంటి వారు ఇంకా ట్రెండింగ్‌‌లోనే ఉన్నారు. అవినాష్ అయితే కామెడీ స్టార్స్ షోతో సెట్ అయ్యాడు. అరియానా అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా అన్ని చోట్ల రచ్చ చేస్తోంది.

    బిగ్ బాస్ బజ్‌ షోను నడిపిస్తోన్న అరియానా దాన్ని గాడిన పెట్టలేకపోతోంది. ఆ బజ్‌ను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతోంది అరియానా. అందుకే అంతగా క్లిక్ అవ్వడం లేదు ఆ ఇంటర్వ్యూలు. కాసేపు ఆ విషయాలు పక్కన పెట్టేద్దాం. తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీలో అరియానా, లాస్యలు కూడా వచ్చారు. వచ్చే వారం రాబోతోన్న ఎపిసోడ్ ప్రోమోను కాసేపటి క్రితం వదిలారు.

    అందులో లాస్య వేసిన కౌంటర్లకు అరియానా మొహం మాడిపోయింది. నేను వచ్చి ఇంత సేపు అవుతున్నా ఎవ్వరూ కూడా సెల్ఫీలు అడగడం లేదేంటి? అని లాస్యతో అంటుంది. నువ్ ఇలియానావి కాదు.. అరియానావి అంటూ కౌంటర్ వేసింది. దీంతో అరియానా మొహం తెల్లబోయింది.

    Leave a Reply