• October 26, 2021

అలాంటివి పోస్ట్ చేయకు!.. సమంతకు సలహా ఇచ్చిన న్యాయస్థానం

అలాంటివి పోస్ట్ చేయకు!.. సమంతకు సలహా ఇచ్చిన న్యాయస్థానం

    సమంత కొన్ని యూట్యూబ్ చానెళ్ల మీద వేసిన కోర్టు కేసులో మొత్తానికి తీర్పు వచ్చింది. తన ప్రతిష్టకు, పరువు భంగం కలిగించేలా కొందరు ప్రసారాలు చేశారంటూ రెండు యూట్యూబ్ చానెల్స్, డాకర్ట్ సీఎల్ వెంకట్రావు మీద సమంత కేసు పెట్టిన సంగతి తెలిసిందే. వాదోపవాదాలు విన్న కోర్టు మొత్తానికి తన తీర్పును ఇచ్చింది. యూట్యూబ్ ఛానెల్స్‌తో పాటు సీఎల్ వెంకట్రావు ప్రసారం చేసిన వీడియోల లింకులను వెంటనే తొలగించాలంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వును ఇచ్చింది.

    అయితే దీంతో పాటు సమంతకు కోర్టు కొన్ని సలహాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దంటూ సమంతకు సలహా ఇచ్చినట్టు సమాచారం. అయితే యూట్యూబ్ చానెళ్లకు మాత్రం కోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఇకపై ఆమె వ్యక్తిగత విషయాల్లోకి తొంగి చూడకూదని, ప్రసారాలు చేయకూడదని వార్నింగ్ ఇచ్చింది. అభ్యంతరకరంగా ఉన్న వీడియోలను వెంటనే డిలీట్ చేయాలని యూట్యూబ్ చానెళ్లను కోర్టు ఆదేశించింది.

    నాగ చైతన్యతో విడాకుల అనంతరం సోషల్ మీడియాలో సమంత మీద ఎలాంటి ఆరోపణలు, కథనాలు వెల్లువెత్తాయో అందరికీ తెలిసిందే. తన డిజైనర్ ప్రీతమ్‌తో సమంతకు సంబంధాలు అంటగట్టారు. చివరకు అబార్షన్లు కూడా చేయించుకుందంటూ వార్తలు రాసేశారు. అలాంటి వాటిని చూసి విసుగు చెందిన సమంత కోర్టు మెట్లెక్కిసింది. కోర్టు కూడా సమంత వాదనలోని ఆవేదను అర్థం చేసుకుంది. ఆమె పరువుకు భంగం కలిగించేలా ఉన్న వాటిని వెంటనే డిలీట్ చేయాలని ఆదేశించింది.

    అయితే సమంతకు ఎలాంటి సలహాలు, సూచనలు కోర్టు ఇవ్వలేదని కొంతమంది అంటున్నారు. అలా సూచించే అధికారం లేదని నెటిజన్లు వాదిస్తున్నారు.

    Leave a Reply