• November 7, 2021

Raja Vikramarka : లవ్ స్టోరీ మొత్తం చెప్పేశాడు.. స్టేజ్ మీదే కార్తికేయ రచ్చ.. లోహితతో పెళ్లి ఎప్పుడంటే?

Raja Vikramarka : లవ్ స్టోరీ మొత్తం చెప్పేశాడు.. స్టేజ్ మీదే కార్తికేయ రచ్చ.. లోహితతో పెళ్లి ఎప్పుడంటే?

    కార్తీకేయలో మంచి నటుడున్నాడు. సరిగ్గా వాడుకునే దర్శకుడు అంటే.. ఎలాంటి పాత్రనైనా చేయించవచ్చు. విలన్ పాత్రల్లోనూ ఇప్పుడు మెప్పిస్తున్నాడు. నాని గ్యాంగ్ లీడర్ చిత్రంతో కొత్త అవతారం ఎత్తాడు. సినిమా వర్కువుట్ కాకపోవడంతే కార్తీకేయకు పేరు రాలేదు. కానీ విలన్ పాత్రలకు బాగా సూట్ అవుతాడని అందరినీ అర్థమైంది. అందుకే కోలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తలా అజిత్ వలిమైలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చేశాడు. అయితే కార్తీకేయ ఇప్పుడు రాజా విక్రమార్క అనే సినిమాతో రాబోతోన్నాడు.

    వచ్చే వారం రిలీజ్ కాబోతోన్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఆ ఈవెంట్‌లో తనకు కాబోయే భార్య లోహితను అందరికీ పరిచయం చేశాడు. బీటెక్ ఫ్రెండ్, లవ్ అంటూ ఇది వరకు తన ప్రేమ గురించి చెప్పేశాడు. అయితే తన ప్రేమ ఎలా మొదలైంది.. మధ్యలో ఏం జరిగిందో ఇలా స్టేజ్ మీద మొత్తం వివరించాడు. అప్పుడే ఇంటర్ అయిపోయి బీటెక్‌కు వస్తాం.. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో కెరీర్ మీద అంతగా ఫోకస్ ఉండదు.. మరీ ఓ లెవెల్ ఉన్న అమ్మాయి కాకుండా.. మన రేంజ్‌కు సరిపోయే.. ట్రే చేస్తే పడే అమ్మాయిని చూసుకుంటాం.

    ఆ అమ్మాయి ఫోన్ నంబర్ పట్టుకుంటాం.. మెసెజ్ చేస్తాం.. రిప్లై కోసం ఎదురుచూస్తుంటాం.. అలా నేను లోహితను చూసి ఇష్టపడ్డాను. మెసెజ్ చేశాను. రిప్లై కోసం ఎదురుచూశాను. అలా ఎప్పటికో ఫైనల్ ఇయర్‌లో ఓకే చెప్పించుకున్నారు. తనతో ప్రేమను ఒప్పించుకునేందుకు హీరో అయ్యేుందుకు ఎంతలా కష్టపడ్డానో అంత కష్టపడ్డాను. ఎన్నో గిఫ్టులు ఇచ్చాను. అలా మొత్తానికి ఓకే చెప్పింది. ఫోన్‌లో ప్రపోజ్ చేశాను. హీరో అవుతాను, అలా అయ్యాకే మీ ఇంట్లో వచ్చి చెబుతాను.. అని అప్పుడే చెప్పాను. అందరి దయ వల్ల హీరోగా అయ్యాను.. మీ నాన్నను వచ్చి అడిగాను.

    మన పెళ్లి గురించి మాట్లాడాను. నేను అన్న మాటను నిలబెట్టుకున్నాను. నువ్ నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇలా అన్నీ నువ్వే. ఇకపై ఒకే ఒక్క రోల్. జీవితాంతం ఒకే ఒక్క రోల్. ఇంత వరకు నీకు సరిగ్గా ప్రపోజ్ చేయలేదు కదా? అంటూ స్టేజ్ మీదే మోకాళ్లపై నిల్చుని లోహితకు ప్రపోజ్ చేశాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగేశాడు. మొత్తానికి కార్తికేయ స్టేజ్ మీదే తన ప్రేమ గుట్టు బయటపెట్టేశాడు. అంతే కాకుండా నవంబర్ 21న పెళ్లి చేసుకోబోతోన్నానంటూ అసలు సంగతి కూడా చెప్పేశాడు.

     

    Leave a Reply