• October 30, 2021

Karthika Deepam Episode 1184 : దీప కనిపించకపోవడంతో కార్తీక్ షాక్.. అసలు నిజం తెలుసుకున్న వంటలక్క

Karthika Deepam Episode 1184 : దీప కనిపించకపోవడంతో కార్తీక్ షాక్.. అసలు నిజం తెలుసుకున్న వంటలక్క

    Karthika Deepam Episode 1184 కార్తీకదీపం సీరియల్‌లో శుక్రవారం నాడు దీపకు నిజం చెప్పకుండా సౌందర్య, కార్తీక్ ఎలాగోలా తప్పించుకున్నారు. మోనిత బిడ్డ కోసం సంతకం పెట్టాడని,అది కృత్రిమంగా వచ్చిన గర్భం కాదని, సహజంగా వచ్చిందని తెలిస్తే దీప పరిస్థితి ఎలా అని అనుకున్నారు. ఇక ఆనంద్ రావుకు ఆ నిజం తప్పక చెప్పాల్సి వచ్చింది. ఆ నిజం విన్న ఆనంద్ రావు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. మొత్తానికి శనివారం నాడు అంటే ఎపిసోడ్ నంబర్ 1184లో ఏం జరగబోతోందంటే..

    కార్తీక్ చేసిన పనికి ఆనంద రావు తెగ బాధపడుతుంటారు. మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లే సమయంలోనే కార్తీక్‌ను లాగి పెట్టి కొట్టేస్తాడు ఆనంద్ రావు. ఛీ దౌర్భాగ్యుడా అంటూ నానా రకాలుగా చీవాట్లు పెడతాడు. పదకొండేళ్లు దీపను అనుమానించావ్.. ఆ సమయంలో మోనితకు దగ్గరయ్యావ్.. నీ పిల్లలు పేపర్లో వచ్చింది చూసే అలా అనుకున్నారు.ఇప్పుడ ఈ నిజం తెలిస్తే ఏమవుతారు?.. దీప కళ్లలోకి చూసి మాట్లాడకుండా చేశావ్ కదరా?. మమ్మల్ని మనశ్శాంతిగా బతకనివ్వవా? నేను బతికింది ఇలాంటివి చూడటానికేనా? అంటూ ఆవేదన చెందాడు.

    అలా దీప కాఫీ తెచ్చే లోపే ఇదంతా జరిగింది. కాఫీ పట్టుకుని వస్తే.. అక్కడ ఎవ్వరూ ఉండరు. దోషిలా అలా కార్తీక్ నిలబడి ఉంటాడు. అత్తయ్య, మావయ్య వెళ్లిపోయారా? ఏం చెప్పారు? అని అంది. పెద్దవాళ్లు చిన్నవాళ్లకు ఏం చెబుతారో అదే చెప్పారు అంటూ అర్థంకాని విధంగా కార్తీక్ చెబుతాడు. ఏదో తేడాగా ఉన్నారు అని దీప అర్థం చేసుకుంటుంది.

    అలా సీన్ కట్ చేస్తే మోనిత భారతిల మీద ఓపెన్ అవుతుంది. మోనిత ఏం తినడం లేదని భారతీ ఫీల్ అవుతూ.. ఏదైనా తింటేనే కదా? ఆరోగ్యంగా ఉండేది అని చెబుతుంది. తినాలని అనిపించడం లేదు..కార్తీక్ నన్ను భార్యగా స్వీకరించకపోతే నా పరిస్థితి ఏంటి? అని మోనిత కంగారు పడుతుంది. నీళ్లలో దూకే ముందు ఈత వస్తుందా? రాదా? అని ఆలోచించాలి. దూకిన తరువాత కాదు అని భారతి అంటుంది.

    ఇది కృత్రిమ గర్భం కాదు.. సహజంగా వచ్చిందని తెలిస్తే.. దీప షాక్ తింటుంది. ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటుంది.. లేదా.. మూటూ మూళ్లే సర్దుకుంటుంది. నా భయం దాని గురించి కాదు. మా అత్త, మా ఆయన గురించే. వాళ్లు నన్ను ఇంట్లోకి స్వాగతిస్తారా? అయినా మోనిత ఏంటి ఇలా భయపడటం, మోనిత ఒకటి అనుకుంటే సాధించకపోవడమా? నా నెక్స్ట్ ప్లాన్ అదే. నా అత్తింట్లోకి అడుగు పెట్టడం అని మోనిత చెబుతుంది.

    ఇక భారతిలో కాస్త మార్పు కనిపించినట్టుంది. దీప జీవితం ఇలా అవ్వడానికి నేను కూడా ఓ కారణం. నువ్ నా ఫ్రెండ్ అని చెప్పడంతో.. మంచి చెడూ అని చూడకుండా అన్ని పనులు చేశాను. అలా ఓ ఆడదాని కాపురాన్ని నాశనం చేశాను అని భారతి పశ్చాత్తాపడుతుంది. అయితే కోడి మీద జాలి పడితే చికెన్ ఎంజాయ్ చేయగలమా? అంటూ మోనిత పిచ్చి పిలాసఫీలు చెబుతుంది. నువ్ నా ఫ్రెండ్‌వి నా కోసం చేశావ్.. నా ప్రేమ, నా పరిస్థితిని అర్థం చేసుకో నీక్కూడా టన్నుల కొద్దీ జాలి పుడుతుంది అని మోనిత చెప్పుకొచ్చింది.

    అలా సీన్ కట్ చేస్తే కార్తీక్, సౌందర్యల మీద ఓపెన్ అవుతుంది. మీ నాన్న ఇంకా ఆ కోపంలోంచి బయటకు రాలేదు అని చెబుతుంది. ఇదే విషయం దీపకు తెలిస్తే నేను ఏం చేయాలి? ఒకప్పుడు దానికి సపోర్ట్ చేశాను.. కానీ ఇప్పుడు చేయలేను.. అలా అని నీకూ చేయలేను.. ఓపిక పట్టు అని దానికి సర్ది చెప్పలేను.. దానికి ఏం సమాధానం చెప్పాలిరా అంటూ సౌందర్య ఎమోషనల్ అవుతుంది.

    అంతలోపే పిల్లలిద్దరు వచ్చి బాంబ్ పేల్చుతారు, ఇళ్లంతా వెతికాం కానీ అమ్మ కనిపించడం లేదంటూ దీప గురించి సౌందర్య, కార్తీక్‌లకు చెబుతారు. ఫోన్ కూడా ఇంట్లోనే ఉందని అంటారు. అలా దీప ఎక్కడికి వెళ్లి ఉంటుందా?అని అందరూ కంగారు పడ్డారు. కానీ దీప మాత్రం ఆధారాలు వెతికే పనిలో ఉంది. డాక్టర్ బాబు చెప్పినట్టుగా తన శాంపిల్స్ వాడుకుని దీప గర్భం తెచ్చుకుందా? అని అనుమానపడుతుంది. అందుకే ల్యాబ్‌కు వెళ్లి అసలు రిపోర్ట్స్ సంగతి ఆరా తీసింది.

    అలా ల్యాబ్‌లో కూర్చుని తనలో తాను మథన పడుతుంది. అసలు ఏం జరుగుతోంది. శాంపిల్స్ ఇవ్వలేదని తెలిస్తే.. డాక్టర్ బాబు అబద్దం చెప్పినట్టా.. మోనిత మ్యానేజ్ చేసి వీరితో అబద్దం చెప్పించిందా? ఎవరు మోసం చేస్తున్నారు.. ఇద్దరు మోసం చేస్తున్నారా? ఈ చిక్కు ముడి కాసేపట్లో తేలబోతోందా? అంటూ దీప తన మనసులో తాను అనుకుంటుంది.

    అయితే వచ్చే వారం మాత్రం అదిరిపోయే ట్విస్ట్ రానుంది. అందులో శాంపిల్స్ ఎవ్వరికీ ఇవ్వలేదని, ఎవ్వరూ వచ్చి తీసుకోలేదని, ఆ మోనిత ఎవ్వరో కూడా తెలీదని డాక్టర్ చెబుతాడు. మరో వైపు ప్రియమణి మాత్రం ఇంకో ప్లాన్ వేసింది. పుట్టిన బిడ్డ పేగు మెళ్లో వేసుకుని పుట్టాడట.. అలా అయితే తండ్రికి గండం కదా? అంటే.. మన డాక్టర్ బాబుకే కదా? అని సౌందర్య మీద మరో బాంబ్ వేసింది. దీంతో కథ మరో వైపుకు తిరుగనుంది.

    Leave a Reply