- November 2, 2021
Karthika Deepam Episode 1186 : దోషనివారణ పూజ కోసం సౌందర్య.. దీప కంటపడ్డ కొత్త విషయం
కార్తీకదీపం సీరియల్లో ఇప్పుడు మోనిత విసిరిన ఉచ్చులో సౌందర్య చిక్కుకుంది. పుట్టిన బిడ్డ పేగు మెడలో వేసుకుని పుట్టాడంటూ రాయబారాన్ని చేరవేసింది. ఇక ఇప్పుడు సౌందర్య అలా చిక్కుకుంది. తన కొడుక్కి ఏమైనా అయిపోతుందా? అనే భయంతో ఏకంగా పంతులు దగ్గరకు వచ్చింది. పేగు మెడలో వేసుకని పుడితే మేనమామకు, తండ్రికి గండం అని చెబుతాడు. అలా మొత్తానికి మంగళవారం నాటి ఎపిసోడ్లో సౌందర్య మీద నడుస్తుంది. భయం, బెరుకుతో సతమతమవుతూనే ఉంటుంది. 1186 ఎపిసోడ్లో ఏం జరిగిందో ఓసారి చూద్దాం.
పుట్టిన బిడ్డ పేగు మెడలో వేసుకున్నా పుట్టాడని తెలియడం, దాని కోపం పంతులు దగ్గరికి సౌందర్య రావడంతోనే సీరియల్ ఓపెన్ అవుతుంది. ఈ పాపంలో మాకు ఈ శాపం ఎందుకు..పేగు మెడలో చుట్టుకుని పుట్టాడట.. ఏం చేయాలి అలానే వదిలేయాలా?.. నాకేం అర్థం కావడం లేదు.. దీపకు అన్యాయం చేస్తున్నానా?.. అయినా కార్తీక్ మంచి కోసం చేస్తున్నానంటే అది దీపకు కూడా మంచే కదా?.. అంటే నేను చేసేది మంచే.. అంటూ తనను తాను సముదాయించుకుంది.
ఇక శాంతి పూజకు అమ్మానాన్న ఇద్దరూ ఉండాలి.. అని పంతులు చెప్పడంతో సౌందర్య షాక్ అవుతుంది. మోనిత ఉంటే కార్తీక్ రాడు.. అయినా మోనితను ఏ మొహం పెట్టుకుని అడగాలి అంటూ సౌందర్య కంగారు పడుతుంది. ఇక దీప గురించి ఆలోచిస్తూ ఎక్కడికి వెళ్లి ఉంటుందని మథన పడుతుంది. అదే సమయంలో దారిలో దీప ఎదురవుతుంది. దీపను సౌందర్య కారులో ఎక్కించుకుని వెళ్తుంది. ఇక పంతులు రాసిన పూజా సామాగ్రి చీటి, సెల్ ఫోన్ ఒకే దగ్గర ఉంటుంది.
ఫోన్ రావడంతో సౌందర్య కంగారు పడుతుంది. అందులోనే పంతులు రాసిన చీటి ఉంది..అది దీప కంట పడితే ఎలా అని తెగ భయపడుతుంది సౌందర్య. కార్తీక్ పదే పదే ఫోన్ చేస్తుండటంతో.. దీప ఆ ఫోన్ తీసి సౌందర్యకు ఇస్తుంది. అయితే ఫోన్లో మాట్లాడేందుకు సౌందర్య ఇబ్బంది పడుతూ ఉంటే.. నేను దిగలా? అత్తయ్యా? అని అంటుంది దీప. ఆ మాటలకు షాక్ తిన్న సౌందర్య.. ఫోన్ పెట్టేసే ప్రయత్నం చేసింది. కానీ అవతల కార్తీక్..దీప గురించి, ఆ నిజం గురించి మాట్లాడతాడు.
దీంతో కంగారు పడ్డ సౌందర్య కారు బయటకు వచ్చి మాట్లాడుతుంది. తనకు తెలియకుండా ఏదో మాట్లాడుకుంటున్నారని దీప ఎమోషనల్ అవుతుంది. అదే సమయంలో ఆ పంతులు రాసిన చీటి కనిపిస్తుంది. దోష నివారణ పూజ అది కూడా డాక్టర్ బాబు పేరు మీదా? నాకు తెలియకుండా ఏదేదో చేస్తున్నారంటూ దీప తన మనసులో బాధపడుతుంది. అలా మొత్తానికి ఎపిసోడ్ ముగుస్తుంది.
కానీ ఈ ఎపిసోడ్లో ఒకేచోట మోనిత కనిపిస్తుంది. భారతి మోనితల ముచ్చట్లు చూపించారు. తన ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని భారతితో మోనిత తన బాధను చెప్పుకుంటుంది. సొల్లుకబుర్లు చెప్పుకోవాలి.. కదా? ఎలా ఉన్నావ్ ఏం తిన్నావ్ అని అనాలి కదా? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటూ మోనిత చెబుతుంది. ఇంటిని అద్దెకు ఇస్తున్నావట కదా? అని మోనితను భారతి అంటే.. నీ ఇంటికి అయితే రానులే అని మోనిత కౌంటర్ వేస్తుంది. ఎక్కడ ఉంటావ్ అని భారతి అంటే.. నా కార్తీక్ గుండెల్లో ఉంటాను అని సెటైర్ వేసింది. మొత్తానికి మోనిత మాత్రం పెద్ద ప్లాన్ వేసినట్టు కనిపిస్తోంది.