• November 2, 2021

Guppedantha Manasu Episode 284 : రింగ్ చుట్టే కథ తిరుగుతోంది.. వసుధారపై రిషి కోపం

Guppedantha Manasu Episode 284 : రింగ్ చుట్టే కథ తిరుగుతోంది.. వసుధారపై రిషి కోపం

    గుప్పెడంత మనసు సీరియల్ ఇప్పుడు అంతా కూడా రింగ్ చుట్టే తిరుగుతోంది. అది జగతి మేడం ప్రేమతో వసుధారకు ఇచ్చింది. కానీ రిషి మాత్రం అది తెలియకు ఇంకోలా అనుకుంటున్నాడు. శిరీష్ వసుల ఎంగేజ్మెంట్ రింగ్ అని భ్రమ పడతాడు. మొత్తానికి మంగళవారం నాటి ఎపిసోడ్ కూడా రింగు చుట్టే తిరిగింది. ఎపిసోడ్ 284లో ఏం జరిగిందో ఓసారి చూద్దాం.

    క్లాస్ రూంలోకి ఎంట్రీ ఇచ్చి రిషి.. వసును చూసి డిస్టర్బ్‌గా ఫీలవుతాడు. క్లాస్ లేదని చెబుతాడు. కానీ వసు మాత్రం ఎందుకు సర్ అని అడుగుతుంది. దీంతో మళ్లీ వెనక్కి వచ్చి చెబుదామని అనుకుంటాడు. కానీ వసు చెబితే నేను క్లాస్ చెప్పడం ఏంటి? అని బోర్డు మీద నో క్లాస్ అని రాసి అందరికీ అర్థమయ్యేలా చెబుతాడు. క్లాస్ లేదు లైబ్రరీకి వెళ్లి చదువుకోండని రిషి అంటాడు. ఒక్క వసును మాత్రం ఆగమని అంటాడు.

    ఎందుకు ఆగమన్నాను..నీ మనసులో ఏమని అనుకుంటున్నావ్? అని వసుని రిషి అడుగుతాడు. క్లాస్ ఎందుకు తీసుకోరు అని మిమ్మల్ని అడిగినందుకు ఇప్పుడు నాకు క్లాస్ తీసుకుంటారేమో సర్ అని వసు అంటుంది. అందుకు కాదు అని రిషి సమాధానం ఇస్తాడు. కొన్ని బుక్స్ తీసి ఉంచమని లైబ్రేరియన్‌కు చెప్పాను.. అవి తీసుకుని రా అని వసుకు పని చెబుతాడు. కానీ వసు వెళ్లి అడిగితే అక్కడ బుక్స్ ఉండవు. బుక్స్ లేవని తెలిసినా కూడా రిషి సర్ ఎందుకు ఇలా పంపించాడు అని వసు అనుకుంటూ వస్తుంది. అలా వసును చూసిన రిషి కూడా అనుకుంటాడు.

    లైబ్రరికి వెళ్లినట్టుంది.. అక్కడ బుక్స్ లేవని చెప్పినట్టున్నారు.. అయినా నేను వసును ఎందుకు ఇలా పంపించాను.. శిరీష్ గుర్తుకు వస్తున్నాడనా? అని రిషి తనలో తాను అనుకుంటాడు. అయితే వసుకు మహేంద్ర ఎదురుపడతాడు. పొగరు అని కాంటాక్ట్ ఎవరిదా? అని కనుక్కునే పనిలో మహేంద్ర ఉన్నాడు. రిషి సర్ నిన్ను ఏమని పిలుస్తాడు? అని వసును మహేంద్ర అడిగాడు. వసుధార.. ఏ వసుధార అని పిలుస్తాడు. ఒక్కోసారి కోపంగా అంటాడు తప్పా.. ఇంకేం అనడు అని రిషిలా ఇమిటేట్ చేసి వసుధార చూపిస్తుంది.

    కోపాన్ని అర్థం చేసుకున్నావ్ కదా? అలానే రిషిని కూడా నువ్వే అర్థం చేసుకోవాలి.. నేను చెప్పిన పనిని ఎంత వరకు చేశావ్.. జగతి మేడంను రిషిని కలిపే పని ఎంత వరకు వచ్చింది? అని వసును మహేంద్ర అడుగుతాడు. నా వరకు ప్రయత్నం చేస్తున్నాను సర్ అని వసు చెబుతుంది.

    అక్కడ సీన్ కట్ చేస్తే జగతి మేడం రిషి మధ్య ప్రాజెక్ట్ గురించి మాటలు జరుగుతాయి. మిషన్ ఎడ్యుకేషన్ బాగా చేస్తున్నారు.. మీ ప్రణాళికలు, మీ మీద నాకు నమ్మకం ఉంది.. మీరు కాలేజ్ వరకు బాగానే ఉన్నారు. కానీ ఇతరుల జీవితాలను మీ ఆధీనంలోకి ఎందుకు తెచ్చుకుంటున్నారు. వసుధారను ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు.. ఆమె జీవితాన్ని మీరు చేతుల్లోకి ఎందుకు తీసుకున్నారు? అంటూ జగతి మేడంను నిలదీస్తాడు రిషి.

    అదే సమయంలో వసు రావడంతో టాపిక్ ఆపేస్తాడు రిషి. దీంతో జగతి మేడం వెళ్లిపోతుంది. రిషి వసుల మధ్య సీన్ మొదలవుతుంది. శిరీష్ కూడా వసుతో ఉన్నట్టు భ్రమల్లో ఉంటాడు రిషి. ఇక్కడి నుంచివెళ్లిపోండి అని రిషి అరుస్తాడు. ఇక్కడ ఇంకా ఎవరు ఉన్నారు సర్.. నేను ఒక్కదాన్నే కదా? వెళ్లండి అని ఎందుకు అంటున్నారు? అని వసు అనడంతో రిషి ఊహల్లోంచి వాస్తవంలోకి వస్తాడు.

    దీంతో చిరాకుతో రిషి తన పెన్నుతో టేబుల్ మీద కొడతాడు. అది వసు కంటికి తగులుతుంది. దీంతో రిషి మనసు తల్లడిల్లిపోతంది. దగ్గరకు వచ్చి చూస్తాడు. చున్నీని తీసుకుని కంటి మీద వేడితో అద్దుతాడు. అయితే రిషి మాత్రం మళ్లీ ఆ రింగును చూసి హర్ట్ అవుతాడు. నాకు నచ్చని నిర్ణయం తీసుకున్నావ్ అంటూ.. తన మనసులో తానే అనుకుంటాడు. చదువు మధ్యలో పెళ్లి ఏంటి.. నాకు నచ్చలేదు.. అయినా నాకు నచ్చేది ఏంటి.. అయినా తెలివిగల దానివా? తెలివి తక్కువ దానివో నీకు తెలియాలి.. అంటూ రిషి అనుకుంటాడు.

    ఆ తరువాత జగతి మేడం ,మహేంద్ర మాట్లాడుంటారు. నేను వసు జీవితాన్ని అధీనంలోకి తెచ్చుకున్నానా? పాడు చేస్తున్నానా? రిషి అలా ఎందుకు అన్నాడు అంటూ మహేంద్రకు చెబుతూ జగతి బాధపడుతుంది. శిరీష్ వసుల పెళ్లి జగతి చేస్తుందని రిషి తప్పుగా అనుకుంటున్నాడా? ప్రేమను బయటపెడతాడని అనుకుంటే.. జగతి మీద కోపాన్ని పెంచుకుంటున్నాడా? అని మహేంద్ర తన మనసులో అనుకుంటాడు. అలా మొత్తానికి ఎపిసోడ్ ముగుస్తుంది.

    రేపటి ఎపిసోడ్‌లో ఇక ఆ రింగ్ విషయం వసు నోటి ద్వారానే బయటకు రాబోతోంది. ఇది ఎంతో ఇష్టమైన వాళ్లు, ప్రేమతో ఇచ్చారంటూ జగతి మేడం గురించి వసు చెబుతుంది. కానీ రిషి మాత్రం శిరీష్ ఇచ్చాడనే భ్రమలో ఉంటాడు. మొత్తానికి రేపటి ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతోంది.

    Leave a Reply