• October 28, 2021

ప్రేమ పాఠాలు చెబుతోందిగా.. కార్తీకదీపం మోనిత మామూల్ది కాదు

ప్రేమ పాఠాలు చెబుతోందిగా.. కార్తీకదీపం మోనిత మామూల్ది కాదు

    కార్తీకదీపం సీరియల్‌తో ఎక్కువగా ఫేమస్ అయింది మోనిత. మోనిత పాత్రలో శోభా శెట్టి అద్బుతంగా నటిస్తోంది.తనను చూస్తే ఎవ్వరికైనా సరే నరికి పోగులు పెట్టాలనిపిస్తుంది. అంతలా ప్రేక్షకులకు కోపం తెప్పిస్తోందంటూ ఆమె తన పాత్రలో లీనమైనట్టు. అలా శోభా శెట్టి తెరపై మాత్రమే అలా ఉంటుంది. క్రూరత్వం, కుట్రలతో మోనిత మాత్రమే అలా విలన్‌గా ఉంటుంది. కానీ నిజ జీవితంలో శోభా శెట్టి ఎంతో మంచిది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటుంది. అలా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.

    ఇప్పుడు కార్తీకదీపం సీరియల్ నడుస్తుందంటే దానికి కారణం కూడా శోభా శెట్టి. మోనితనే అంతా తన భుజాల మీద వేసుకుని సీరియల్‌ను ముందుకు నడిపిస్తోంది. ఇప్పుడు గర్భం నాటకం, పిల్లాడు పుడుతున్నాడు అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ కార్తీక్, దీపల మధ్య మళ్లీ దూరం పెంచేందుకు నానా కష్టాలు పడుతోంది. అయితే సీరియల్ కథ అలా ఉంచితే.. శోభా శెట్టి మాత్రం నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా శోభా శెట్టి ప్రేమ గురించి ఓ పోస్ట్ పెట్టింది.

    శోభా శెట్టి తన ఫోటోలు, తన వీడియోలతో నానా హంగామా చేస్తుంటుంది. తన అభిమానులతో నిత్యం టచ్‌లోనే ఉంటుంది. అయితే తాజాగా శోభా శెట్టి ప్రేమ సూక్తిని వల్లించింది. ఎవరైనా మనతో గొడవపడ్డారనుకోండి.. వారు తమ ఇగోలను పక్కన పెట్టేసి.. మనతో ముందు మాట్లాడేందుకు వచ్చారంటే.. వారు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారని అర్థం అంటూ ఉన్న ఓ పోస్ట్‌ను శోభా శెట్టి షేర్ చేసింది. అంటే శోభా శెట్టికి ఆ కొటేషన్ జీవితంలో ఎక్కడో ఓ సారి తగిలినట్టు అనిపిస్తోంది.

    Leave a Reply