- October 28, 2021
క్రీడా అవార్డుల పురస్కారం.. ఖేల్ రత్నలు వారే

ధ్యాన్ చంద్ జయంతి సందర్బంగా ప్రతీ ఏటా 29న జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటామన్న సంగతి తెలిసిందే. మామూలుగా అయితే ఆ రోజే క్రీడా అవార్డులు ప్రకటించారు. కానీ ఈ సారి పారా ఒలింపిక్స్ క్రీడలు ఉండటం, వాటిలోని ప్రతిభా వంతుల్ని కూడా ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో ఈ అవార్డులను కాస్త వాయిదా వేశారు. ఇప్పుడు మొత్తంగా కలిపి అందరికీ అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది.
ఖేల్ రత్న అవార్డులు ఈ సారి దాదాపు 11 మందికి ఖేల్ రత్న అవార్డు లభించనుంది. ఇందులో ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి పతకాలు సాధించిన వారున్నారు. వారితో పాటు మిథాలీ రాజ్ కూడా ఉన్నారు. నీరజ్ చోప్రా (జెవెలిన్ త్రో.. బంగారు పతకం) రవి దహియా (రెజ్లర్ రజతం) పీఆర్ శ్రీజేష్ (హాకీ), లవ్లీనా బోర్గోహెయిన్ (బాక్సింగ్), సునీల్ ఛెత్రి (ఫుట్ బాల్), ప్రమోద్ భగత్ (బాడ్మింటన్), సుమిత్ అంటిల్ (జావెలిన్ త్రో), అవని లెఖరా (షూటింగ్), కృష్ణ నగార్ (పారా బ్యాడ్మింటన్), మనీష్ నర్వాల్ (షూటర్)లకు ఖేల్ రత్న అవార్డు వరించింది.