• October 21, 2022

ఆహాలో దూసుకుపోతోన్న ‘కపట నాటక సూత్రధారి’

ఆహాలో దూసుకుపోతోన్న ‘కపట నాటక సూత్రధారి’

    ప్రస్తుతం సినిమాలో సత్తా ఉంటే.. కంటెంట్ కొత్తగా ఉంటే.. థియేటర్, ఓటీటీ అనే తేడా లేకుండా అన్ని చోట్లా అద్భుతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. కంటెంట్ బేస్డ్ చిత్రాలకు ప్రస్తుతం డిమాండ్ ఉంది. రొటీన్ కమర్షియల్ ఫార్మాట్‌ కంటే.. కొత్తదనం ఉన్న సినిమాలను జనాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. అలా ఓ బ్యాంక్ దొంగతనం చుట్టూ అల్లిన కథతో తెరకెక్కిన కపట నాటక సూత్రధారి సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

    విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాష్, అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు ప్రధాన తారాగణంగా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘కపట నాటక సూత్రధారి’ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. నేడు ఈ చిత్రం ఆహాలోకి రాగా.. మంచి స్పందనను దక్కించుకుంటోంది.

    నటీనటుల అద్భుతమైన పర్ఫామెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కడం, క్లైమాక్స్ వరకు కూర్చోబెట్టేలా కథనం ఉండటం వంటి అంశాలతో సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆహాలోనూ ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కుతోంది.

    క్రాంతి సైన దర్శకత్వం వహించిన ఈ సినిమా కి మనీష్ (హలీమ్) నిర్మాతగా వ్యవహరించారు. వికాస్ బడిస అందించిన రీ రికార్డింగ్ అందరినీ మెప్పించింది. సుభాష్ దొంతి సినిమాటోగ్రఫీ, రామ్ తవ్వ సంగీతం, రామకృష్ణ మాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి