• October 29, 2021

Bigg Boss 5 Telugu : వరెస్ట్ సంచాలక్.. దారుణంగా ఫ్లాప్ అయిన జెస్సీ

Bigg Boss 5 Telugu : వరెస్ట్ సంచాలక్.. దారుణంగా ఫ్లాప్ అయిన జెస్సీ

    బిగ్ బాస్ ఇంట్లో ఇప్పటికీ సెట్ కాని కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా? అంటే అది జెస్సీ. బిగ్ బాస్ ఇచ్చిన ఆటను సరిగ్గా అర్థం చేసుకోలేడు. ఎలా ఆడాలో తెలియదు.ముందుగా బిగ్ బాస్ చెప్పిందో అర్థం చేసుకోలేని జెస్సీ ఇంక ఆట ఏం ఆడతాడు. అలా గతంలో ఇచ్చిన సీక్రెట్ టాస్క్ బెడిసి కొట్టేసింది. టాస్క్‌లోని ఆంతర్యం అర్థం చేసుకోలేక దెబ్బ తిన్నాడు. నిన్నటి టాస్కులో పోయి పోయి జెస్సీని సంచాలక్‌గా పెట్టేశాడు బిగ్ బాస్. దెబ్బకు బిగ్ బాసే ఖంగుతిన్నట్టున్నాడు

    టాస్క్ అర్థమైందా? అసలు అంటూ బిగ్ బాస్ కూడా అడిగేశాడంటే పరిస్థితి ఎంత వరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. కన్ ఫెషన్ రూంలోకి జెస్సీని పిలిచిన బిగ్ బాస్ తన స్టైల్లో చీవాట్లు పెట్టాడు. కెప్టెన్సీ టాస్క్ అర్థమైందా? అంటూ అడిగేశాడు. రౌండ్ లైన్స్‌లోంచి తోసేయడం టాస్క్ కాదు అని, ఎవరి బస్తాలో థర్మకోల్స్ తగ్గిపోతాయో వాళ్లు ఎలిమినేట్ అని.. అయితే ఆ సర్కిళ్ల మధ్య కంటెస్టెంట్లు తిరుగుతూ ఉండాలని, ఆగ కూడదంటూ చెప్పేశాడు.

    అయితే జెస్సీ మాత్రం సంచాలకుడిగా పూర్తిగా విఫలమయ్యాడు. శ్రీరామచంద్ర, సన్నీలు బయట ఉన్నప్పుడు ఒక్కడినే ఎలిమినేట్ చేశాడు. అదే శ్రీరామచంద్ర, మానస్ బయటకు వచ్చి కొట్లాడుతుంటే..ఇద్దరిని ఎలిమినేట్ చేశాడు. అసలు టాస్క్ ఎలా ఆడించాలి.. ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా జెస్సీకి తెలియలేదు. అందుకే ఆటను మళ్లీ రీస్టార్ట్ చేయమని బిగ్ బాస్‌ను కోరాడు. మొత్తానికి చివరకు షన్ను మాత్రం ఆ టాస్కులో గెలిచి కెప్టెన్‌గా మారాడు.

    Leave a Reply