- November 2, 2021
Janaki Kalaganaledu Episode 162 : జానకికి జ్ఞానాంబ విషమ పరీక్ష.. ఇంట్లోంచి గెంటేస్తుందట!
జానకి కలగనలేదు మంగళవారం నాటి ఎపిసోడ్‌లో గుండెలు పిండేసే ఎమోషనల్ సీన్లు పడ్డాయి. కొడుకు కాలర్‌ను కస్టమర్ పట్టుకోవడం, నడి రోడ్డు మీద కొడుక్కి అవమానం జరుగుతుంటే జ్ఞానాంబ ఎంట్రీ ఇవ్వడం.. తన కొడుకు అంటూ చెప్పడంతో రామ కళ్లలో ఆనందం కనిపించడం, తనతో మాట్లాడమని క్షమించిమని రామ, జానకీలు జ్ఞానాంబ కాళ్ల మీద పడటం, తల్లీ కొడుకులు ఎక్కడ కలిసి పోతారో అని మల్లిక తెగ మథన పడటం వంటివాటితో ఎపిసోడ్ ముగసింది.
Janaki Kalaganaledu Episode 162లో ఏం జరిగిందో వివరంగా చూద్దాం. సోమవారం నాటి ఎపిసోడ్ ముగింపులో జానకి రామలు పుత రేకుల తయారీ గురించి మాట్లాడుకుంటారు. అత్తయ్య గారిని అడుగుదాం.. షాపు కోసం అంటే సాయం చేస్తారు అని జానకీ సలహా ఇవ్వడంతో రామ వద్దంటాడు. నిన్న రాత్రి అమ్మ దగ్గరికి వెళ్లి కాళ్లు పడుతూ ఉంటే.. వీడి కారణంగా చాలా బాధపడుతున్నాను.. ఇలా పదే పదే మాట్లాడటానికి ప్రయత్నించి.. నన్ను చంపోద్దు అని నాన్నతో చెప్పింది.. ఇప్పుడు మళ్లీ వెళ్లి అడిగితే అమ్మ కోపంతో పాటు.. బాధ కూడా ఎక్కువే అవుతుంది.. ఇంకా అమ్మను బాధపెట్టలేను.. ప్రాణమే పోతోంది.. ఈ బాధ ఎంత అండి అంటూ జానకితో రామ చెప్పుకుంటాడు..
ఇక తెల్లారి షాపులో కస్టమర్ వచ్చి గొడవ పెడతాడు. రజినీ మీద రామ అరుస్తాడు. కస్టమర్‌కు ఫోన్ చేసి చెప్పలేదా? అని రజినీ మీద రామ అరిస్తే.. కస్టమర్ రామను వీధిన నిల్చోబెడతాడు. అల్లరి చేస్తాడు. కాలర్ పట్టుకుంటాడు. అదే సమయానికి సరిగ్గా జ్ఞానాంబ ఎంట్రీ ఇస్తుంది. ఎవరో తెలుసుకుని చేతులు వేయాలి.. వాడు నా కొడుకు.. నా కొడుకు కాలర్ పట్టుకోవడానికి ఎంత ధైర్యం.. ఇదిగో నువ్ ఇచ్చిన ఆర్డర్ అంటూ కస్టమర్‌కు చూపిస్తుంది జ్ఞానాంబ.
అయితే రామకు సారీ చెప్పాలని జ్ఞానాంబ డిమాండ్ చేస్తుంది. అలా మొత్తానికి తన కొడుకు పరువును కాపాడేసింది జ్ఞానాంబ. ఇక అనంతరం రామ తన తల్లికాళ్ల మీద పడతాడు. క్షమించమని వేడుకుంటాడు.20 ఏళ్ల నమ్మకం.. దాన్ని పోగొట్టకు అని చెప్పు.. కొట్టు మాత్రమే కాదు.. ప్రాణాలు కూడా నీ చేతుల్లోనే ఉన్నాయమ్మ.. నువ్ నాతో మాట్లాడొద్దు అని అన్న మాటలు తప్ప ఇంకేం వినబడటం లేదు. కనబడటం లేదు. ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా ప్రాణం పోతోందమ్మా.. నా ప్రాణమే మా అమ్మ అయినప్పుడు.. నా ప్రాణం నాతో మాట్లాడొద్దు అని చెప్పినప్పుడు.. తట్టుకుని బతకగలనా? ఈ నరకం,,రంపపు కోత మా అమ్మకు తెలియదా? నేను చెప్పాలా? నేను ఇప్పుడు కేవలం ప్రాణం ఉన్న బొమ్మలా బతుకుతున్నాను.. నువ్ నాత మాట్లాడకుండా ఇంకా ఇలానే ఉంటే.. ప్రాణం కూడా పోతుందమ్మా అని రామ కంటతడి పెట్టేసుకుంటాడు.
ఇక జానకి సైతం జ్ఞానాంబ కాళ్ల మీద పడుతుంది. కావాలంటే నన్ను శిక్షించండి..నన్ను వెళ్లగొట్టండి.. కానీ మా ఆయనకు అమ్మను దూరం చేయకండి.. అమ్మ లేకపోతే ఆయన బతకడు అంటూ జానకీ ఏడ్చేస్తుంది. అయితే కాస్త కరిగిన జ్ఞానాంబ.. నీ భార్యను తీసుకుని మన తోటకు రా అని రామకు చెబుతుంది. దీంతో మల్లిక ఈ విషయం తెలుసుకుని తెగ కంగారు పడుతుంది. ఈ ఇద్దరూ మళ్లీ ఎక్కడ ఒక్కటవ్వుతారు. జానకికి మళ్లీ పెత్తనం ఇస్తారా? అని మల్లిక మథన పడుతుంది.
తోటలో వాళ్లేం మాట్లాడుకుంటున్నారో వినేందుకు వెళ్తుంది మల్లిక. అయితే అంతటి ఎపిసోడ్ ముగుస్తుంది. కానీ రేపటి ఎపిసోడ్‌లో జానకికి జ్ఞానాంబ విషమ పరీక్ష పెట్టబోతోన్నట్టు కనిపిస్తోంది. పది హేను రోజులు గడువు ఇస్తాను.. తన ఇంటి పరువు పోకుండా.. తన ప్రవర్తన, తన కొడుకుతో గొడవలు పెట్టకుండా తన కొడుకు గౌరవానికి భంగం కలగకుండా ప్రవర్తిస్తే ఇంట్లో ఉంటావని లేదంటే నీ భర్తే నిన్ను ఇంట్లోంచి పంపించేస్తాడు అని కండీషన్ పెట్టేసింది. మరి ఈ చాలెంజ్‌లో జానకి గెలుస్తుందా. మల్లిక అసలు గెలవనిస్తుందా? అన్నది చూడాలి.