- October 21, 2021
Avinash-Viva Harsha: టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సందడి.. అటు అవినాష్ ఇటు వైవా హర్ష!
Avinash-Viva Harsha జబర్దస్త్ అవినాష్ అనూజల పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో ఎంతగా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్లు, జబర్దస్త్ ఆర్టిస్ట్‌ల రాకతో అవినాష్ పెళ్లిలో సందడి వాతావరణం నెలకొంది. దివి, అరియానా, సోహెల్, మెహబూబ్, రోల్ రైడా, భాను శ్రీ వంటి వారు బిగ్ బాస్ కంటెస్టెంట్లలోంచి అవినాష్ పెళ్లికి హాజరైనట్టు కనిపిస్తోంది. ఇక జబర్దస్త్ టీం నుంచి చాలా మందే వచ్చినట్టు కనిపిస్తోంది.అదిరే అభి, నవీన్, కెవ్వు కార్తీక్, రాం ప్రసాద్ వంటి వారు వచ్చినట్టు తెలుస్తోంది.
అలా అవినాస్ అనూజల వివాహాం బుల్లీతెర తారలతో సందడిగా జరిగింది. ఇక మరో వైపు కమెడియన్ వైవా హర్ష పెళ్లి కూడా గ్రాండ్‌గా జరిగింది. అవినాష్ పెళ్లికి బుల్లితెర కదిలివస్తే.. వైవా హర్ష పెళ్లికి సిల్వర్ స్క్రీన్ తారలు వచ్చారు. డైరెక్టర్ మారుతి, నిర్మాత పీఆర్వో ఎస్కేఎన్ వంటివారు హాజరయ్యారు. భానుమతి రామకృష్ణ ఫేమ్ సలోని లూత్రా, రవి పేరేపు వంటి సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఇక స్పెషల్ అట్రాక్షన్‌గా మెగా డాటర్ సుష్మిత కొణిదెల వచ్చినట్టు తెలుస్తోంది.
హర్ష అక్షరల వివాహానికి టాలీవుడ్ నుంచి సెలెబ్రిటీలు వచ్చి బరాత్‌లో డ్యాన్సులు కూడా వేసినట్టు కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా భానుమతి రామకృష్ణ గ్యాంగ్ సందడి చేసేసింది. మొత్తానికి అటు అవినాష్ పెళ్లి, ఇటు వైవా హర్ష పెళ్లిళ్లతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారింది. ఈ పెళ్లి ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.