- October 16, 2021
Bigg Boss: అందుకే బిగ్ బాస్ అలా చేశాడా?.. డబుల్ ఎలిమినేషన్!

Bigg Boss బిగ్ బాస్ ఇంట్లో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవబడతాయో ఎవ్వరూ చెప్పలేరు. అంతా బిగ్ బాస్ చేతుల్లోనే ఉంటాయి. ఓ కంటెస్టెంట్‌ను మంచిగా ప్రొజెక్ట్ చేయాలన్నా, చెడుగా చూపించాలన్నా కూడా అంతా బిగ్ బాస్ టీం చేతుల్లోనే ఉంటుంది. అయితే అప్పుడప్పుడు బిగ్ బాస్ టీం కాస్త ఝలక్‌లు ఇస్తుంటుంది. ఒక్కోసారి డబుల్ ఎలిమినేషన్ అంటూ భయపెడుతుంది. మరికొన్ని సార్లు ఎలిమినేషన్అని చెప్పి సీక్రెట్ రూంలోకి పంపిస్తాడు. అలా బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చెప్పలేం.
అయితే ఈ ఐదో సీజన్‌లోని ఆరో వారం మాత్రం బిగ్ బాస్ ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ఆరోవారంలో ఎన్నడూ లేని విధంగా పది మందిని నామినేషన్‌లో పడేశాడు బిగ్ బాస్. రెండు ఓట్లు వచ్చిన వారిని కూడా నామినేషన్‌లోకి వేసేశాడు. అలా మొత్తంగా ఈ సారి పది మంది నామినేషన్‌లోకి వచ్చారు. మిగిత నలుగురు మాత్రమే ఈ వారం ఎంతో ఖుషీగా ఉన్నారు. అయితే పది మంది నామినేషన్‌లోకి రావడంతో జనాలకు కొత్త అనుమానాలు వస్తున్నాయి.

కొంపదీసీ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? అని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ అదే జరిగితే ఇంటి నుంచి బయటకు వెళ్లే కంటెస్టెంట్లలో ఎవరు ఉంటారు? అని అనుకుంటున్నారు. శ్రీరామచంద్ర, సిరి, లోబో, విశ్వ, షన్ను, ప్రియాంక, యాంకర్ రవి, జెస్సీ, శ్వేత, సన్నీ ఇలా అందరూ నామినేషన్‌లోకి వచ్చారు. ఆరోవారం టాస్కులు, పర్ఫామెన్స్‌లు ప్రవర్తనలు బట్టి చూస్తుంటే త్రిమూర్తుల్లో (షన్ను, సిరి, జెస్సీ) ఒకరు బయటకు వెళ్లే చాన్స్ కనిపిస్తోంది.
ఆ ముగ్గురు బిగ్ బాస్ ఇంట్లో చేసే పనేమీ కూడా లేదు. ముగ్గురూ ఒకే చోట కూర్చోవడం, మిగతా కంటెస్టెంట్ల గురించి మాట్లాడుకోవడం,నవ్వుకోవడం, గేలిచేయడం వంటివి చేస్తుంటారు. అయితే మిగతా వారిలో ఎక్కువగా ఎలిమినేట్ అయ్యేందుకు శ్వేతకు అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే అసలు డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా. లేదా సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా? అనే విషయం ఇంకొన్ని గంటల్లో తేలనుంది.