• October 30, 2021

Intinti Gruhalakshmi Today Episode 464 : అందరి ముందూ దోషిలా నిలబడ్డ తులసి.. కన్నీరు పెట్టించేశారుగా

    Intinti Gruhalakshmi Today Episode 464  ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్‌లో అందరూ కలిసి తులసిని టార్గెట్ చేయడం నానా రకాలుగా మాటలు అనడం పరిపాటే. గయ్యాలి అత్త, అర్థం చేసుకోలేని భర్త, లాస్య ఇలా అందరూ తులసిని ఆడిపోసుకునేవాళ్లే. ఎప్పుడు ఎక్కడ దొరుకుతుందా? అని చూస్తుంటారు. శనివారం నాడు అంటే ఎపిసోడ్‌ నంబర్ 464లో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం

    నిన్న పిజ్జా గురించి ఎంతో గొప్పగా చెప్పి తులసి తెచ్చిన లంచ్ బాక్స్ మీద సెటైర్లు వేసింది. అయితే ఆ పిజ్జా పాచిపోవడంతో లాస్యకు దిమ్మతిరిగిపోయింది. ఆపిజ్జాను తినలేక నానాతంటాలు పడింది. అది గమనించిన తులసి మరింత రెచ్చగొట్టింది. శ్రుతికి ఫోన్ చేసి మరీ వంటల గురించి గొప్పగా చెప్పింది. అద్భుతంగా చేశావ్ అంటూ పొగిడింది. అది వింటూ లాస్య మరింత ఉడికిపోయింది.

    అలా కాసేపు సరదాగా నవ్వుకునే సీన్ వచ్చింది. ఆతరువాత నందు.. ఆఫీస్‌లో ఎంప్లాయిస్ మాట్లాడుకునే మాటలు విన్నాడు.ఎంతైనా మన బాస్ లక్కీ.. నారి నారి నడుమ మురారి టైపులో ఎంజాయ్ చేస్తున్నాడు.. వద్దన్నా వదలని ప్రియురాలు.. వదిలేసిన భార్య.. ఇద్దరితో ఎంజాయ్ చేస్తున్నాడు.. మన బాస్ మధ్యలోనే అన్నీ వదిలేస్తాడట.. పెళ్లి చేసుకున్న భార్యను మధ్యలోనే వదిలేశాడు.. ప్రేమించిన దాన్ని పెళ్లి చేసుకోకుండా మధ్యలోనే ఆగాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే వదిలేశాడు అని ఓ ఎంప్లాయ్ అంటాడు.

    ఈ మాటలన్నీ మన బాస్ వింటే ఇక అంతే.. అని ఇంకొకడు అంటాడు. ఆయన మన బాస్ ఏంటి.. మనకు జీతాలు ఇచ్చేది తులసి మేడం. ఆమె చెప్పిందంటే కచ్చితంగా ఇస్తుంది అంటూ ఇలా నానా రకాలుగా మాట్లాడుకున్నారు. ఆ మాటలు విన్న నందు తెగ ఊగిపోయాడు. ఇంటికి వచ్చీ రావడంతోనే తులసి మీద చిందులు తొక్కేశాడు.

    అందరి ముందు ఎదవను చేసిందంటూ ఇంటి సభ్యుల ముందు తులసిని నిలబెట్టి మరీ పరువుతీశాడు. నాకున్న టెంపర్‌కి ఏం చేస్తానో నాకు తెలీదు. మీ మాజీ కోడలు పిల్లిలా కనిపిస్తుంది కానీ జింతుల మారి నక్క అంటూ నందు తన తండ్రికి చెబుతాడు. అందరి ముందు నన్ను ఎదవను చేసింది..పేరుకే బాస్.. జీతాలు ఇచ్చేది నేను అని ప్రచారం చేసుకుంది.. ఒక్క నెల జీతాలు ఇచ్చి. రాజు అయిపోవాలని చూస్తోంది..నన్ను చీపురుపుల్లలా తీసి పడేసింది.. చేతగాక పెళ్లాన్ని వదిలేశానట.. మళ్లీ పెళ్లి చేసుకునే స్థోమత లేక పక్కన పెట్టుకున్నానట.. అన్నీ మధ్యలోనే వదిలేస్తానట అని ఎంప్లాయిస్ మాట్లాడుకున్నారు.

    అలా మాట్లాడేంత ధైర్యం వచ్చింది అంటే దానికి కారణం తులసి అంటూ ఆరోపణలు చేశాడు. వాటికి తోడుగా లాస్య, అభి కూడా మధ్యలో కొన్ని పుల్లలు వేశారు. ఇక గయ్యాలి అత్త ఊరుకుంటుందా? చివర్లో వచ్చి ఆమె కూడా అనాల్సిన మాటలు అనేసింది. మొత్తానికి నందు ఇకపై ఆఫీస్‌కు వెళ్లనని, ప్రాజెక్ట్ సంగతి తనకు అవసరం లేదని.. పెనాల్టీ కట్టకపోతే జైలుకైనా వెళ్తాను అని తెగేసి చెప్పేశాడు. అలా చేయంకండి.. మాట ఇచ్చింది నేను అంటూ తులసి ప్రాధేయపడినా వినలేదు.. అ

    మొత్తానికి తులసి చేత కంటనీరు పెట్టించేశారు. అలా సీన్ కట్ చేస్తే తులసి తన కూతురు బాధపడటం చూస్తుంది. ఎందుకమ్మా అలా ఉన్నావ్ అంటూ ఏమీ చెప్పదు. అంతేలే ఈ అమ్మకు చెప్పినా చేసేదేం లేదు.. వేస్ట్ అని అనుకుంటున్నావా? ఇంట్లో అందరూ అదే అనుకుంటున్నారుగా అని తులసి ఎమోషనల్ అవ్వడంతో అసలు నిజం చెప్పింది. స్కూల్ ఫీజ్ కట్టకపోవడంతో లెక్చరర్ అందరి ముందు అవమానించాడు.. ఆన్ లైన్ క్లాసు నుంచి లాగ్ అవుట్ చేసేశాడు అంటూ అసలు నిజం చెప్పింది.

    ఫీజు గురించి నువ్ చెప్పావ్ కానీ నాకు గుర్తుకు లేదు.. మళ్లీ గుర్తుకు చేయోచ్చు కదా? తులసి అంటుంది. ఇప్పటికే నీకున్న సమస్యలు చాలు.. మళ్లీ నేను కూడా ఓ సమస్యను కాకూడదని చెప్పలేదు అమ్మా అని అంటుంది. కూతరు కష్టాలను కూడా తీర్చలేనా? అది నాకు సమస్య ఎలా అవుతుందంటూ వారిద్దరి మధ్య ఎమోషనల్ సంభాషణలు జరిగాయి. చదువురాని దాన్ని.. పనికి రాని దాన్ని.. వదిలేశారు.. ఆయన వదిలేశారు కదా? అని నేను నా జీవితాన్ని వదిలేయలేను కదా? అంటూ తులసి తన కూతురుతో చెప్పుకుంది.

    ఇక రానున్న ఎపిసోడ్‌లో అయితే.. తులసి, లాస్యలు సవాళ్లు విసురుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ కుటుంబం ముక్కలు అవుతుంది.. ఎవరి దారిన వాళ్లు వెళతారు.. రెండు కోట్ల పెనాల్టీని నందు కట్టేస్తాడు.. నిన్ను బయటకు గెంటేస్తారు అంటూ తులసి మీద లాస్య ఫైర్ అవుతుంది. నన్ను కాదు నిన్ను గెంటేస్తారు అంటూ తులసి సవాల్ విసిరింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

    Nandu Feels Insulted S1 E46430 Oct
    అందరి ముందూ దోషిలా నిలబడ్డ తులసి.. కన్నీరు పెట్టించేశారుగా

    ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్‌లో అందరూ కలిసి తులసిని టార్గెట్ చేయడం నానా రకాలుగా మాటలు అనడం పరిపాటే. గయ్యాలి అత్త, అర్థం చేసుకోలేని భర్త, లాస్య ఇలా అందరూ తులసిని ఆడిపోసుకునేవాళ్లే. ఎప్పుడు ఎక్కడ దొరుకుతుందా? అని చూస్తుంటారు. శనివారం నాడు అంటే ఎపిసోడ్‌ నంబర్ 464లో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం

    Leave a Reply