• October 15, 2023

తుత్తర ఆపుకోలేకపోయిన హరీశ్ శంకర్?

తుత్తర ఆపుకోలేకపోయిన హరీశ్ శంకర్?

    హరీష్ శంకర్ స్టేజ్ మీద ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. నిన్న పొలిమేర 2 ట్రైలర్ ఈవెంట్ జరిగింది. అందులో హరీష్ శంకర్ స్పీచు అందరినీ ఆకట్టుకుంది. తన ఫ్లాపుల మీద తానే సెటైర్లు వేసుకున్న తీరుగానీ, పొలిమేర 2 టీంను పొగిడిన తీరు గానీ అందరినీ కట్టిపడేసింది. మామూలుగానే హరీశ్ శంకర్ అంటే కౌంటర్లు పడుతూనే ఉంటాయి. ఇక సురేష్ కొండేటికి ఎంతో విన్రమంగానే కౌంటర్లు వేసినట్టుగా అనిపిస్తుంది.

    సంస్కారవంతుడు అంటూ హరీశ్ శంకర్ సురేష్ కొండేటికి దింపాల్సిందంతా దింపేశాడు. అలా హరీష్ శంకర్ తన సినిమాల్లోని, సీన్లలోని పదునంతా కూడా నిన్న స్టేజ్ మీద చూపించాడు. అయితే ఓ చోట మాత్రం కాస్త తుత్తర ఆపుకోలేకపోయినట్టుగా కనిపించింది. బన్నీ వాసు స్పీచు స్టార్ట్ చేసినప్పుడు ఈ ఘటన జరిగింది. బన్నీ వాసు తన ప్రసంగం ప్రారంభిస్తూ.. మీడియా గురించి ముందుగా చెప్పాలని అనుకున్నాడు.

    తాము ఏం చేయాలనుకున్నా కూడా తమ కంటే ముందుగా వస్తారని, తమ కోసం నిలబడతారని ఇలా ఏదో చెప్పుకుంటూ వెళ్లాడు బన్నీ వాసు. మధ్యలో హరీష్ శంకర్ కలగజేసుకుని.. నేను మీకంటే లేటుగా వచ్చాను అని అంటాడు. నీ గురించి కాదు మీడియా గురించి చెబుతున్నాను అని బన్నీ వాసు క్లారిటీ ఇస్తాడు. దీంతో సైలెంట్‌గా హరీష్ శంకర్ వెనక్కి వెళ్లిపోతాడు. అలా కాస్త తుత్తర ఆపుకుంటే బాగుండేదనిపించింది. ఎవరి గురించి చెబుతున్నారో వినకుండా.. తన గురించే చెబుతున్నారని అనుకోవడంతో ఇలా జరిగింది.