• October 15, 2023

గందరగోళంగా బిగ్ బాస్.. అంతా ఉల్టా పుల్టానే.. ఎవరు వస్తారో? వెళ్తారో?

గందరగోళంగా బిగ్ బాస్.. అంతా ఉల్టా పుల్టానే.. ఎవరు వస్తారో? వెళ్తారో?

    బిగ్ బాస్ ఐదు వారాల వరకు ఓ మాదిరిగా సాగింది. ఇక కిరణ్, షకిలా, రతిక, దామిని, శుభ శ్రీ ఇలా అంతా లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతూనే వచ్చారు. ఈ ఆరో వారంలోనూ లేడీ కంటెస్టెంట్ బయటకు వెళ్లేలా కనిపిస్తోంది. నయని ఎలిమినేట్ అంటూలీకులు వస్తున్నాయి. అయితే నయని వెళ్తుందే లేదో పక్కన పెడితే.. ఈ ఆరోవారంలో నాగార్జున పెద్ద షాక్ ఇచ్చి వెళ్తున్నాడనిపిస్తోంది. ఇంట్లోకి పాత కంటెస్టెంట్లను పట్టుకొచ్చారు.

    దామిని, రతిక, శుభ శ్రీలను ఇంట్లోకి పట్టుకొచ్చారు. ఇంట్లో వాళ్ల ఓటింగ్ ప్రకారం ఎవరో ఒకరు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతోన్నారట. ఇంట్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే.. వాళ్లకు ఎంట్రీ ఉంటుందని నాగ్ అన్నాడు. అయితే ఈ మేరకు శుభ శ్రీకి ఎక్కువ ఓట్లు పడేలా ఉన్నాయి. దామిని, రతికకు అంతగా ఓట్లు పడకపోవచ్చు. అయితే ఇక్కడే ఉల్టా పుల్టా జరిగేలా ఉందట.

    ఏ కంటెస్టెంట్‌కు అయితే ఓట్లు తక్కువగా వస్తాయో వాళ్లనే ఇంట్లోకి పంపిస్తారట. మిగిలిన ఇద్దరినీ బయటకు పంపిస్తారట. ఈ మేరకు నెట్టింట్లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మరి నయన్ ఎలిమినేట్ అయిన తరువాత.. శుభ శ్రీ, దామిని, రతికల్లోంచి ఇంట్లోకి ఎవరు వస్తారో చూడాలి. ఏది ఏమైనా ఇక ఏడో వారం నుంచి సీజన్ అంతా ఉల్టా పుల్టాగానే ఉండేలా కనిపిస్తోంది.