• August 4, 2025

జెర్సీకి ముందు అనుకున్న టైటిల్ ఇదే – గౌతమ్ తిన్ననూరి

జెర్సీకి ముందు అనుకున్న టైటిల్ ఇదే – గౌతమ్ తిన్ననూరి

    మళ్లీ రావా, జెర్సీ, కింగ్డమ్ అంటూ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. మళ్లీ రావా, జెర్సీ ఎమోషనల్ డ్రామాలు కాగా.. కింగ్డమ్ యాక్షన్, ఎమోషన్ డ్రామాగా గౌతమ్ మెప్పించే ప్రయత్నం చేశాడు. అయితే మళ్లీ రావా, జెర్సీ చిత్రాలకు పూర్తి స్థాయిలో ప్రశంసలు వచ్చాయి. కానీ కింగ్డమ్ మూవీకి కొన్ని చోట్ల నెగెటివ్ కామెంట్లు వినిపించాయి. సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదని కామెంట్లు కనిపించాయి.

    అయితే కింగ్డమ్ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపేస్తోంది. మూడు రోజుల్లోనే 63 కోట్లకు పైగా రాబట్టేసింది. కింగ్డమ్‌కి వస్తున్న రెస్పాన్స్ మీద గౌతమ్ తిన్ననూరి మీడియాతో ముచ్చటించారు. కింగ్డమ్ పట్ల తాను సంతోషంగానే ఉన్నానని, అయితే ఇంకా థియేటర్లో సినిమాను చూడలేదని అన్నాడు. కింగ్డమ్ మూవీకి కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చాయని, వాటి నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాని తెలిపాడు.

    పాట ఎందుకు తీశారు? అని చాలా మంది అడుగుతున్నారు. మళ్లీ పాటను యాడ్ చేస్తూ ఓ ప్రత్యేకమైన కట్‌ను నాగవంశీ అడిగారు. ఈ రోజు నుంచి థియేటర్లో పాట కూడా వస్తుంది. ఇప్పుడు ఆ పాట ఎందుకు యాడ్ చేశారని మళ్లీ అందరూ అడుగుతారేమో (నవ్వుతూ). ఈ క్రమంలో కింగ్డమ్ మూవీకి ముందుగా యుద్దకాండ, దేవర నాయక అనే టైటిల్స్‌ను అనుకున్నారట. జెర్సీకి అయితే స్క్రిప్ట్ స్టేజ్‌లో 36 అని అనుకున్నారట. కానీ చివరకు కమర్షియల్ యాంగిల్‌లో ఆలోచించి జెర్సీ అని పెట్టారట.