• November 16, 2021

‘పుష్ప’లో స్పెషల్ సాంగ్.. సమంతకు అంత రెమ్యునరేషనా?

‘పుష్ప’లో స్పెషల్ సాంగ్.. సమంతకు అంత రెమ్యునరేషనా?

    సమంత తీసుకునే నిర్ణయాలతో అందరూ ఆశ్చర్యపోతోన్నారు. సమంత తన కెరీర్‌లో మొదటిసారిగా ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. కెరీర్‌లో మొదటిసారిగా సమంత ఓ ఐటంసాంగ్‌లో నర్తిస్తోంది. ఇలా స్పెషల్ సాంగ్‌లె కనిపించడం అంటే ఒకప్పుడు కాస్త భయపడేవారు. కానీ ఇప్పుడు స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్‌ల మీద మోజు పెంచేసుకుంటున్నారు. దానికి చాలా కారణాలున్నాయి. మహా అంటే ఆ పాట రెండు మూడు రోజుల్లో పూర్తవుతుంది.

    అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తారు.. సినిమా చేస్తే ఎంత తీసుకుంటారో దాదాపుగా అంతే చార్జ్ చేస్తుంటారు. కొంచెం అటూ ఇటుగా ఉంటుంది. అయితే కాజల్, పూజా హెగ్డేలు ఇది వరేక పక్కా లోకల్, జిగేల్ రాణి అంటూ దుమ్ములేపేశారు. మరి ఈ సారి పుష్పలో సమంతను ఎలా చూపిస్తారో చూడాలి. సుకుమార్ స్టైల్లో రాబోతోన్న ఐటం సాంగ్ అంటే అందరికీ అంచనాలుంటాయి. ఇక మంచి బీట్ ఇచ్చేందుకు దేవీ శ్రీ ప్రసాద్ ఉండనే ఉన్నాడు. అదిరిపోయే స్టెప్పులు వేసేందుకు బన్నీ రెడీగా ఉన్నాడు.

    ఇక సమంత కూడా ఓకే చెప్పింది. డ్యాన్సుల్లో బన్నీతో సమంత ఏ మేరకు పోటి పడుతుందో ఇప్పుడే చెప్పలేం. కానీ ఈ స్పెషల్ పాట కోసం సమంత భారీ మొత్తంలో తీసుకుంటోందంట. దాదాపు కోటిన్నర డిమాండ్ చేసిందట. ఆ మొత్తం చెల్లించేందుకు నిర్మాతలు అంగీకరించారట. ఇక ఈ పాట కోసం కేవలం సమంతకే కోటి కోటిన్నర చెల్లించారట.. పాటను ఇంకెంత భారీ ఎత్తున తెరకెక్కిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    Leave a Reply