పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధ దామోదర్ స్టూడియో బ్యానర్లపై నిహారిక కొణిదెల సమర్పణలో‘కమిటీ కుర్రోళ్లు’ అనే చిత్రాన్ని పద్మజ కొణిదెల, జయలక్ష్మీ అడపాక నిర్మించారు. ఎద వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.
ఈ చిత్రం నుంచి ఇప్పటికే వదిలిన పాట, పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఓ ఫీల్ గుడ్ పాటను రిలీజ్ చేశారు. నాటి రోజుల్లోకి తీసుకెళ్లేలా ఉన్న ‘ఆ రోజులు మళ్లీ రావు’ అనే ఈ పాటను సింగర్ కార్తిక్ ఆలపించారు. కృష్ణ కాంత్ రాసిన ఈ పాట మన మూలాల్ని గుర్తు చేసేలా ఉన్నాయి. అనుదీప్ దేవ్ బాణీ ఎంతో క్యాచీగా,వినసొంపుగా, హాయిగా ఉంది. ఈ లిరికల్ వీడియోని చూస్తే మళ్లీ మన ఊర్లోకి వెళ్లాలని అనిపించేలా ఉంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా రాజు ఎడురోలు వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనుదీప్ దేవ్ వ్యవహరిస్తున్నారు. ఎడిటర్‌గా అన్వర్ అలీ పని చేస్తున్నారు.