- February 2, 2024
ధీర రివ్యూ.. లక్ష్ వన్ మెన్ షో
Dheera Movie Review ధీర మూవీ సినిమాతో లక్ష్ చదలవాడ ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వలయం, గ్యాంగ్ స్టర్ గంగరాజు అంటూ ప్రేక్షకులను మెప్పించిన లక్ష్.. ఇప్పుడు మాస్ యాక్షన్ మూవీతో వచ్చాడు. ఈ చిత్రం ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో అంచనాలు పెంచేసింది. థియేటర్లో ఈ మూవీ ఆడియెన్స్ ఏ మేరకు ఆకట్టుకుందో ఓ సారి చూద్దాం.
కథ
రణధీర (లక్ష్ చదలవాడ) వైజాగ్‌లో డబ్బే లక్ష్యంగా బతుకుతాడు.. డబ్బు కోసం ఏమైనా చేసేందుకు రెడీ అవుతాడు. అలాంటి రణధీరకు ఓ మిషన్ వస్తుంది. కోమాలో ఉన్న రాజ్ గురుని వైజాగ్ నుంచి హైద్రాబాద్‌కు తీసుకెళ్లే కాంట్రాక్ట్‌ను తీసుకుంటాడు రణధీర. అంబులెన్స్‌లో రణధీర వెళ్తుంటాడు. డాక్టర్ అమృత (నేహా పఠాన్) సైతం రణధీరతో వెళ్తుంది. మరో డాక్టర్ కూడా వారి వెంట వెళ్తాడు. అయితే ఈ అంబులెన్స్ మీద ఓ ముఠా దాడి చేస్తుంది. హైద్రాబాద్‌కు అంబులెన్స్ చేరకుండా అడ్డు పడుతుంటుంది. ఏపీ రాజకీయానికి చెందిన హంసలేఖ దేవి (హిమజ) ఓ పాపను ప్రాణాలతో తీసుకురావాలంటూ పోలీస్ ఆఫీసర్ (భరణి)కి చెబుతుంది. అసలు ఈ రాజ్ గురు ఎవరు? కోమాలోకి ఎందుకు వెళ్లాడు? ఈ పాప ఎవరు? ఈ కథలో రణధీరకు ఉన్న లింక్ ఏంటి? చివరకు రణధీర ఏం చేశాడు? అన్నది తెరపై చూడాల్సిందే.
నటీనటులు
రణధీర పాత్రలో లక్ష్ అద్బుతంగా నటించాడు. ఎమోషనల్, లవ్, రొమాంటిక్ ఇలా అన్ని సీన్లలో ఆకట్టుకున్నాడు. మరీ ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టేశాడు. లక్ష్ కటౌట్‌కు తగ్గ ఎలివేషన్స్ పడ్డాయి. సరైన మాస్ కమర్షియల్ సినిమాలో లక్ష్ కనిపించాడు. ఈ సినిమా అంతా వన్ మెన్ షోగా తన భుజాల మీద మోసినట్టుగా అనిపించింది. హీరోయిన్లిద్దరూ గ్లామర్ పరంగా ఆకట్టుకున్నారు. హిమజ, భరణి శంకర్, విలన్ పాత్రలు బాగానే ఉన్నాయి. ధీర చిత్రంలో ఇలా ఎన్ని పాత్రలున్నా కూడా లక్ష్ కారెక్టర్ హైలెట్‌గా నిలుస్తుంది. అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించి అందరినీ ఆకట్టుకున్నాడు.
విశ్లేషణ
రాజకీయ నేపథ్యంతో సాగే ఈ కథలో ఊహించని ట్విస్టులున్నాయి.. రెండు డిఫరెంట్ లవ్‌స్టోరీలు, భారీ యాక్షన్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలను పొందుపరిచారు. దర్శకుడు పేపర్‌పై బలంగా రాసుకున్న స్టోరీ.. మరీ అంత ఎఫెక్టివ్‌గా, ప్రేక్షకుడు సీటు అంచున కూర్చుని చూసేలా చేయడంలో అంతగా సఫలం కాలేదనిపిస్తుంది. హీరో ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు చాలా సన్నివేశాలు గత సినిమాలను గుర్తుకు తెస్తాయి. రాజ్‌గురు స్టోరీ ఏంటనేది మాత్రం చివరి వరకు ప్రేక్షకుడు పసిగట్టకుండా చేయడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజ్గురుని హైదరాబాద్‌కు తరలించేందుకు డాక్టర్లు ప్రయత్నించడం.. మరోవైపు హంసలేఖ ఫోన్ ద్వారా వైద్యులకు సూచనలు ఇవ్వడం..ఇలా చాలా ఆసక్తికరంగా కథ ప్రారంభం అవుతుంది. లక్ష్ ఎంట్రీ స్టార్ హీరో రేంజ్లో ఉంటుంది. కారు రేసింగ్ సీన్‌తో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో తెలియజేశాడు. మీనాక్షితో రణ్‌ధీర్ లవ్‌స్టోరీ ఎంటర్టైనింగ్గా ఉంటుంది.
హీరో లవ్స్టోరీలోని ట్విస్ట్ రివీల్ అయ్యాక మరింత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓ భారీ యాక్షన్.. రొమాంటిక్ సీన్స్.. ఇంట్రెస్టింగ్ లవ్‌స్టోరీతో ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో ఒక్కో ట్విస్టు రివీల్ చేస్తూ ఆసక్తికరంగా కథనాన్ని నడించాడు. పాప ఎవరు? ఆమె కోసం వెతుకుతున్నదెవరు అనేది తెలుసుకోవడం కోసం హీరో చేసే ప్రయత్నం బాగుంది. క్లైమాక్స్ యాక్షన్ సీన్ ఆకట్టుకుంటుంది.
సాంకేతికంగానూ ఈ చిత్రం బాగుంది. పాటలు, ఆర్ఆర్ ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. కెమెరా మెన్ ఇచ్చిన విజువల్స్ ఎంతో రిచ్‌గా ఉన్నాయి. ప్రతీ ఫ్రేమ్ ఎంతో రిచ్‌గా కనిపిస్తుంది. ఎడిటింగ్ డిపార్ట్మెంట్ తన శక్తి మేరకు పని చేసింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. పెట్టిన ప్రతీ పైసా తెరపై కనిపించింది.
ధీర.. లక్ష్ వన్ మెన్ షో
రేటింగ్ 3