Shyam Singha Roy : శ్యామ్ సింగ రాయ్ ట్విట్టర్ రివ్యూ.. దుమ్ములేపిన నాని

Shyam Singha Roy : శ్యామ్ సింగ రాయ్ ట్విట్టర్ రివ్యూ.. దుమ్ములేపిన నాని

    న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ నేడు డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ పాటికే కొన్ని చోట్ల షోలు పడ్డాయి. యూఎస్‌లో ఆల్రెడీ ప్రీమియర్లు ప్రారంభమయ్యాయి.

    అయితే ట్విట్టర్‌లో మాత్రం నాని ఫ్యాన్స్ సందడి మొదలైంది. శ్యామ్ సింగ రాయ్ గురించి నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. నాని సాయి పల్లవి సీన్స్ సినిమాకే హైలెట్ అని అంటున్నారు. ప్రేమ కథ అద్బుతంగా ఉందని అంటున్నారు. అప్పటి కాలాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారని అంటున్నారు.

    క్లైమాక్స్ అదిరిపోయిందని చెబుతున్నారు. ఇక సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. సాయి పల్లవి స్క్రీన్ ప్రజెన్స్, శ్యామ్‌గా నాని నటన అదిరిపోయిందని అంటున్నారు.

    ఫస్ట్ హాఫ్ స్లోగానే స్టార్ట్ అయినా కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అదిరిపోయింది.. సెకండ్ హాఫ్ అయితే ప్యూర్‌గా మాస్ స్టఫ్ అని అంటున్నారు. సాయి పల్లవి ఎంట్రెన్స్ సాంగ్ అయితే అదిరిపోయిందని చెబుతున్నారు. నాని పర్ఫామెన్స్ అయితే వేరే లెవెల్ అంట. టెంపుల్ సీన్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా ఉందట. బీజీఎం సూపర్.. ఓవరాల్‌గా బ్లాక్ బస్టర్ అని చెబుతున్నారు.

    తలా తోక లేని స్టోరీ, మాస్ ఆడియెన్స్‌కి అయితే అస్సాం.. ఇంకా ఏ1 సెంటర్స్ ఆడియెన్స్‌ని టార్గెట్ చేసి కూడా వేస్ట్ అయింది అటెంప్ట్. బొక్కలో ట్విస్ట్ పెట్టాడు.. అసలు ఎవరూ దాన్ని ట్విస్ట్ అనుకోరు.. డిజాస్టర్ ఘోరమైన డిజాస్టర్.. థియేటర్లకు వెళ్లి డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు.. అంటూ మరి కొందరు ట్వీట్లు పెడుతున్నారు.

     

    Leave a Reply