- December 24, 2021
Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్ రివ్యూ.. అడుగడుగునా రుద్రాణి.. దీపకు ఎదురుదెబ్బలు
కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్ అంటే శుక్రవారం నాటి ధారావాహిక Karthika Deepam Episode 1231లో దీపకు కష్టాలు ఎదురయ్యాయి. కనీసం కిరాణ కొట్టులో సరుకులు కావాలన్నా కూడా బాగానే కష్టపడాల్సి వచ్చింది. చివరకు శ్రీవల్లి పేరు చెప్పుకుని సరుకులు తీసుకోవాల్సి వచ్చింది. అయితే స్కూల్‌కి వెళ్లిన పిల్లలు అక్కడ ఉండలేకపోయారు. హిమ అయితే ఏకంగా అక్కడి వాతావరణం, తినే తిండిని చూసి అసహ్యించుకుంది. మొత్తానికి నేటి ఎపిసోడ్ రివ్యూని ఓ సారి చూద్దాం.
మోనితను సౌందర్య ఓ ఆట ఆడుకుంటూ ఉంటుంది. తినడానికి కూర్చున్న మోనితను ఇష్టమొచ్చినట్టుగా మాటలు అనేసింది. సిగ్గులేని వాళ్లు వెళ్లిపోవాలి.. నువ్ ఎందుకు వెళ్తావ్ రా అని ఆదిత్యను కూర్చోమంది. ఇది మన ఇళ్లు, మన సంపాదన.. అడ్డమైన వాళ్లు వెళ్లిపోవాలి.. ఇది సౌందర్య ఇళ్లు అంటూ సౌందర్య రెచ్చిపోతుంది. తల్లి ప్రేమ అంటూ దీపు గాడిని దాచిన మోనిత వెళ్లిపోవాలి అని సౌందర్య అంటుంది.
ఇక పిల్లలు స్కూల్‌కి వెళ్తుంటే సంబరంగా ఉంటారు. కానీ చాలా దూరంగా ఉన్నట్టుంది కదా?. నడిచే వెళ్తారులేండి.. నడిస్తే మంచిది కదా? అని దీప అంటుంది. ఇక జేబులో ఉన్న పది రూపాలు తీసి ఇస్తుంటే హిమ వద్దని అంటుంది. నువ్ కూడా నా మీద జాలి చూపిస్తున్నావా? అని కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. తీసుకో హిమ అని దీప అంటుంది.
ఇక సరుకుల కోసం వెళ్లిన దీపకు ఎదురుదెబ్బ తగులుతుంది. అక్కడి అమ్మలక్కలు దీపను సూటిపోటి మాటలతో బాధపెడతారు. కిరాణ కొట్టోడు కూడా సరుకులు ఇవ్వనని అంటాడు. రుద్రాణితో గొడవపడ్డారు కదా? నేను ఇవ్వలేను అని అంటాడు. ఇవి నాకోసం కాదు శ్రీవల్లి కోసమని దీప అంటుంది. వాళ్లకి కూడా ఇవ్వను.. వాళ్లు నాకు చాలా అప్పున్నారు అని అంటాడు
ఆ అప్పు తీర్చమని శ్రీవల్లి చెప్పింది. అందుకే నేను వచ్చాను. వద్దంటే వెళ్తాను అని దీప బుకాయిస్తుంది. దీంతో కిరాణ షాపు వాడు దారిలోకి వస్తాడు. సరుకులు ఇస్తాడు. అవన్నీ నెత్తిన పెట్టుకుని మోసుకుని వస్తుంటుంది. ఇక మరో వైపు మోనితకు ఇన్నాళ్లు సాయం చేసిన రత్నను సౌందర్య ఓ సాయం అడుగుతుంది. మోనితను ఓ కంటకని పెట్టమని అంటుంది.
సరుకులన్నీ మోసుకుంటూ వస్తున్న దీపను చూసి కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. ఇవన్నీ నువ్ ఎందుకు మోసుకువస్తున్నావ్ అని అంటాడు కార్తీక్. ఇవన్నీ నాకు అలవాటే కదా? వంటలక్కని కదా?. అని అంటుంది దీప. సారీ దీప నిన్ను చాలా కష్టపెడుతున్నాను అని కార్తీక్ అంటే.. వంటలక్కకు ఇవన్నీ కామన్.. అని దీప అంటుంది.
వంటలక్కగా మారేందుకు నేను కారణమే కదా?. అని కార్తీక్ అంటే.. భర్త నీడలో ఉంటే కష్టాలనేవి ఉండవు అని దీప అంటుంది.. ఆ అప్పు ఎలా తీర్చుతాం.. పిల్లలకు పుస్తకాలు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నామని కార్తీక్ బాధపడతాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక కోటేశ్, శ్రీవల్లి ఆ బిడ్డకు బారసాల చేద్దామని, పేరు ఆనంద్ అని చెప్పడంతో కార్తీక్, దీప షాక్ అవుతారు.
- Tags
- Deepa
- Doctor Babu
- Karthika Deepam
- Karthika Deepam Episode
- Karthika Deepam Episode 1231
- karthika deepam latest episode
- Karthika Deepam new Episode 1231
- karthika deepam serial today
- Karthika Deepam serial today episode
- Karthika Deepam Today Episode
- Karthika Deepam today Episode 1231
- Monitha
- Premi Viswanath
- Vantalakka
- కార్తీక దీపం
- కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్
- కార్తీక దీపం ఈరోజుది
- కార్తీక దీపం ఎపిసోడ్
- కార్తీక దీపం టుడే ఎపిసోడ్
- కార్తీక దీపం డైలీ సీరియల్
- కార్తీక దీపం నిన్నటి ఎపిసోడ్
- కార్తీక దీపం నేటి ఎపిసోడ్
- కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్
- కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్
- కార్తీకదీపం నేటి ఎపిసోడ్
- కార్తీకదీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్
- కార్తీక్
- దీప
- మోనిత
- వంటలక్క