Akhanda Twitter Review : అఖండ ట్విట్టర్ రివ్యూ.. మాస్‌కు అమ్మా మొగుడు

Akhanda Twitter Review : అఖండ ట్విట్టర్ రివ్యూ.. మాస్‌కు అమ్మా మొగుడు

    నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ అంటే మాస్‌ జాతర అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సింహా, లెజెండ్ ఏ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ కొట్టేశారు. ఇక ఇప్పుడు అఖండ అంటూ మళ్లీ అదే రేంజ్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లతో దుమ్ములేపేశారు. దండం, పిండం.. తలవంచను.. తల తీసుకెళ్తాను వంటి మాస్ డైలాగ్స్‌తో బాలయ్య బోయపాటి కాంబినేషన్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ట్విట్టర్‌లో బాలయ్య అఖండ మార్మోగిపోతోంది.

    ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. మాస్ జాతర.. మాస్ అమ్మా మొగుడు అంటూ నెటిజన్లు దుమ్ములేపుతున్నారు. ఇక తమన్ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ మాత్రం మెంటలెక్కిపోతోందని కామెంట్లు పెడుతున్నారు. ఇంటర్వెల్ అయ్యాక థియేటర్లో మాస్ జాతర జరుగుతోంది. వీటికి సంబంధించిన సెలెబ్రేషన్స్ వీడియోలు నెట్టింట్లో దుమ్ములేచిపోతోన్నాయి.

    అంతా ట్రాన్స్‌లో ఉన్నామంటూ ఆడియెన్స్ కామెంట్లు పెడుతున్నారు. దేవుడు బాలయ్య అంటూ ప్రశంసలతో పిచ్చెక్కిస్తున్నారు. ఇక కొంత మంది అయితే టికెట్లు దొరక్కా, బెనిఫిట్ షోలు లేక బాధపడుతున్నారు. బాలయ్య బోయపాటి ఉతికి ఆరేశారంతే. క్లైమాక్స్ 20 నిమిషాలు నాన్ స్టాప్ యాక్షన్ సీక్వెన్స్, బాలయ్య దుమ్ములేపేశాడు అని అంటున్నారు.

    ఒక్క ఇంటర్వెల్ సీన్ వంద కేజీయఫ్‌లతో సమానంరా.. బాలయ్య మాస్‌రా.. మాస్ డైరెక్టర్‌కే బోయపాటి కేరాఫ్ అడ్రస్‌రా అంటూ అభిమానులు దుమ్ములేపుతున్నారు. దీంతో అంతటా అఖండ మార్మోగిపోతోంది.

    Leave a Reply