- December 2, 2021
Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. నీతో విడాకులు ఇప్పించేదాన్ని!.. సౌందర్య మాటలకు దీప షాక్
కార్తీక దీపం నేటి ఎపిసోడ్ అంటే గురువారం.. అంటే Karthika Deepam Episode 1212లో మోనిత చేసిన పనులకు దీప కరెక్ట్‌గా సమాధానం ఇస్తుంది. ఇక మోనిత ఇలా ప్రతీసారి ఏదో ఒకటి అడ్డంకి కలిగిస్తే ఎలా అని ఆదిత్య, దీప, సౌందర్యలు బాధపడుతుంటారు. మరో వైపు మోనిత కూడా లాయర్‌తో కలిసి కుట్రలు పన్నేందుకు రెడీ అవుతుంది. అలా కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం.
డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కార్తీక్‌ను ఎన్నుకునే ఈవెంట్లో మోనిత మొసలి కన్నీళ్లకు దీప ఆన్సర్ ఇస్తుంది. అసలు కథ అంతా చెప్పి మోనిత గుట్టు బయటపెడుతుంది. నేను దీప.. కార్తీక్ బాబు తాళి కట్టిన భార్య.. తాళి కట్టిన భార్యను అని ఇలా ఎందుకు చెప్పుకుంటున్నానంటే.. ఇక్కడ కొందరు ఎవరికి వారే తాళి కట్టేసుకుని చెప్పేసుకుంటున్నారు.
అందుకే ఇలా నేను తాళి కట్టిన భార్యను చెప్పుకుంటున్నాను. భార్యాభర్తలన్నాక గొడవలుంటాయి.. మాకూడా ఉన్నాయి. మధ్యలో కొన్ని రోజులు దూరంగా ఉన్నాం.. అవి కూడా వేరే వాళ్లు పుట్టించనవే.. ఇప్పుడు అలాంటివేమీ లేవు.. మేం కలిసే ఉంటున్నాం.. ఇక ఈ మోనిత చేసిన దుర్మార్గులా గురించి చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. కిడ్నాపులు చేసింది, మనుషులను మాయం చేసింది.. లేని కడుపును తెచ్చుకుంది.. ఇలాంటి పనులు చేసే వాళ్లను మా ఊర్లో ఏమంటారో తెలుసా? వద్దలేండి.. నాకు సభ్యత సంస్కారం ఉంది ఆ మాటలు నేను అనలేదు.
డాక్టర్ బాబు ప్రెసిడెంట్‌గా ఉండడానికి వీల్లేదు అన్నట్టుగా మోనిత మాట్లాడుతోంది కదా? కానీ ఈ మోనిత అసలు డాక్టర్ వృత్తికే కళంకంగా మారింది. అంటూ దీప వాయించేసింది. అలా ఆ ఈవెంట్ పూర్తయింది. బయటకు వచ్చాక మోనిత, ప్రియమణి మాట్లాడుకున్నారు. ఎందుకమ్మ మనకు ఇవన్నీ.. అవసరమా? అని ప్రియమణి అంటుంది. ఎలాగూ కార్తీక్ అయ్య మిమ్మల్ని పట్టించుకోరు అవసరమా? అని ప్రియమణి అనడంతో మోనితకు కోపం నశాలానికి అంటుంది. బాబును పట్టుకున్నావ్ కాబట్టి సరిపోయింది. లేదంటే నిన్ను కొట్టేదాన్ని. ఇంకోసారి నాకు సలహాలు ఇవ్వకు అని వార్నింగ్ ఇస్తుంది మోనిత.
మళ్లీ డాక్టర్ బాబుతో గొడవ పెట్టుకునేందుకు మోనిత ట్రై చేస్తుంది. బయటకు వచ్చిన కార్తీక్‌ను రెచ్చగొడుతుంది. కానీ సౌందర్య ఆపుతుంది. అలా వెళ్లిపోతోన్న వారిని మోనిత మళ్లీ గెలుకుతుంది. నీకు ఆడపిల్లలున్నారు.. వాళ్లకు కూడా నాలానే అంటూ మోనిత అనడంతో దీప ఉగ్రరూపం దాల్చుతుంది. ఇంకోసారి నా పిల్లల గురించి మాట్లాడితే అంటూ వార్నింగ్ ఇస్తుంది. దెబ్బకు ప్రియమణి జడుసుకుంటుంది.
వెళ్దాం పద అమ్మ గారు అని ప్రియమణి అంటుంది. కానీ మోనిత మాత్రం వెనక్కి తగ్గదు. మీ ఇంటికి వస్తాను.. త్వరలోనే కచ్చితంగా వస్తాను.. అంటూ శపథం చేస్తుంది. ఇక మోనిత చేసిన రచ్చ అంతా గుర్తు చేసుకుని ఇంట్లో అంతా బాధపడుతుంటారు. వారిని చూసి ఆదిత్య ఏమైందని అడుగుతాడు. మోనిత వచ్చిందని, జరిగిందంతా చెబుతారు. ముందే చెప్పాను కదా? ఇలాంటివన్నీ మనకు వద్దని ఎందుకు వెళ్లారు.. మోనిత ఏమంది అంటూ ఆగ్రహంతో ఊగిపోతాడు ఆదిత్య. అదే సమయంలో స్కూల్ నుంచి పిల్లలు వస్తారు. స్వీట్స్ చేయమని అడుగుతారు.
మాట్లాడుతున్నాం కదా?.. మీరు ఎప్పుడంటే అప్పుడే అవుతాయా? అని పిల్లల మీద అరుస్తాడు ఆదిత్య. సరే చేస్తానమ్మ అని దీప తన పిల్లలకు ప్రేమగా చెబుతుంది. అమ్మ ఎంత మంచిదో కదా? అని ముద్దులు పెట్టేసి వెళ్లిపోతారు. ఆ తరువాత సీన్ కట్ చేస్తే లాయర్ మోనితల మీద ఓపెన్ అవుతుంది. ఇంకో రెండు మూడు రోజుల్లో ఫైల్ సిద్దమవుతుందని అంటాడు. కష్టానికి తగ్గ ప్రతిఫలం ట్రాన్స్ ఫర్ చేస్తాను అని మోనిత అంటుంది.
ఇక మోనిత చేసిన రచ్చను తలుచుకుంటూ సౌందర్య కుమిలిపోతుంది. దీపతో తన బాధను చెప్పుకుంటుంది. నా కొడుకు తప్పు చేశాడని తెలిస్తే.. కార్తీక్‌తో నీకు విడాకులు ఇప్పించి.. నీతోనే ఉంటూ నిన్ను మహారాణిలా చూసుకుంటాను అని సౌందర్య అంటుంది. దీంతో దీప షాక్ అవుతుంది. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో.. మాటల్లోనే చెప్పాల్సిన పని లేదు.. నా కొడుకు చేసింది తప్పైనా కష్టపడింది నువ్వే.. అప్పుడు నీకే సపోర్ట్ చేశాను.. మీ ప్రేమను నేను ఎప్పుడూ శంకించలేదు అత్తయ్య.. పదకొండేళ్లు దూరంగా ఉన్నావ్ అప్పుడు కూడా పుత్ర వాత్సల్యం చూపించలేదు.. నీ వైపే ఉన్నాను… కానీ ఇప్పుడు వాడు ఏ తప్పూ చేయలేదు. నలిగిపోతోన్నాడు. బయటకు చెప్పలేడు.. మోనితను గట్టిగా ఎదురించలేడు..వాడిని అలా చూసి భరించలేకపోతోన్నాను.. అంటూ సౌందర్య బాధపడుతుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది.
- Tags
- Deepa
- Doctor Babu
- Karthika Deepam
- Karthika Deepam Episode
- Karthika Deepam Episode 1212
- karthika deepam latest episode
- Karthika Deepam new Episode 1212
- karthika deepam serial today
- Karthika Deepam today Episode 1212
- Monitha
- Premi Viswanath
- Vantalakka
- కార్తీక దీపం
- కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్
- కార్తీక దీపం ఈరోజుది
- కార్తీక దీపం ఎపిసోడ్
- కార్తీక దీపం టుడే ఎపిసోడ్
- కార్తీక దీపం డైలీ సీరియల్
- కార్తీక దీపం నిన్నటి ఎపిసోడ్
- కార్తీక దీపం నేటి ఎపిసోడ్
- కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్
- కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్
- కార్తీకదీపం నేటి ఎపిసోడ్
- కార్తీకదీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్
- కార్తీక్
- దీప
- మోనిత
- వంటలక్క