• August 12, 2023

Bholaa Shankar భజన గ్యాంగ్‌ని ఇప్పటికైనా దూరం పెడడతారా?.. చిరు మారతాడా?

Bholaa Shankar భజన గ్యాంగ్‌ని ఇప్పటికైనా దూరం పెడడతారా?.. చిరు మారతాడా?

    Bholaa Shankar మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా ఏమో గానీ.. ఆయన మాత్రం నిజంగానే భోళా శంకరుడే. ఎవరు వెళ్లి ఏం అడిగినా ఇచ్చేస్తాడు. ఇట్టే కరిగిపోతోంటాడు. మీ అభిమానులం సర్.. మీరంటే ప్రాణంసార్ అని అంటే చాలు మురిసిపోతుంటాడేమో. అందుకే మెగా భజన బ్యాచ్ ఇప్పుడు చాలా ఎక్కువగా ట్రెండ్ అవుతున్నారు. జబర్దస్త్ గ్యాంగ్ అయితే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. అయినా చిరు అభిమానులు కానీ వారు ఎవరుంటారు. గెటప్ శ్రీను, హైపర్ ఆది ఇలా చాలా మంది మెగా డై హార్డ్ ఫ్యాన్స్. అయితే అభిమానులైనంత మాత్రానా వారికి సినిమాల్లో ఛాన్సులు ఇవ్వాలని లేదు.

    బిగ్ బాస్ స్టేజ్ మీద అందరికీ చాన్సులు ఇస్తానని అంటాడు.. తన అభిమానులకు సినిమాలో చోటిస్తానంటాడు.. కథలో భాగంగా, పాత్రలు బాగుంటే ఇచ్చినా పర్లేదు.. కానీ.. పర్టిక్యులర్‌గా వాళ్ల కోసం పాత్రలు క్రియేట్ చేయడం, వారికి ఇవ్వడం అనేది పొరబాటే. భోళా శంకర్ సినిమాలో జరిగింది ఇదే. తెర నిండా ఆర్టిస్టులు కనిపిస్తారు. కానీ ఎక్కడా నిండుదనంగా అనిపించదు. ఎక్కడా నవ్వు పుట్టించలేకపోయారు. ఇలాంటి సినిమాలో ఇంత మంది ఎందుకు? అసలు వీరంతా ఎందుకు? వీరితో కలిసి చిరంజీవి లాంటి స్థాయి ఉన్న వ్యక్తి కామెడీ చేయాలా? శ్రీముఖి, రష్మీ వంటి వారితో స్టెప్పులు వేయాలా? కామెడీ చేయాలా? అని మెగా అభిమానులు అనుకుంటున్నారు.

    చిరంజీవి స్థాయిని తగ్గించేలా ఈ సినిమాను మెహర్ రమేష్ తీశాడని నెటిజన్లు సైతం తిట్టిపోస్తున్నారు. ఇప్పటికీ మెగా భజన చేసే దర్శక నిర్మాతలు, యంగ్ అప్ కమింగ్ సెలెబ్రిటీస్, కొంత మంది పీఆర్వోలు భోళాను కీర్తిస్తున్నారు. భోళా అదిరిపోయిందని ట్వీట్లు పెడుతున్నారు. వీరందరి మీదా మెగా ఫ్యాన్స్, నెటిజన్లు మండి పడుతున్నారు. సినిమా ఏ యాంగిల్‌లో మీకు నచ్చిందో చెప్పండి అంటూ నిలదీస్తున్నారు.

    భోళా శంకర్ మీద ట్రోలింగ్స్ అన్నీ చిరంజీవి దగ్గరికి చేరతాయా? లేదా కోటరీ దగ్గరే ఆగిపోతోందా? చిరంజీవి ఇప్పటికైనా కళ్లు తెరుస్తాడా? ఇలాంటి రొటీన్ రొడ్డ కొట్టుడు, లేకి కామెడీలకు దూరంగా ఉంటాడా? లేదా? అన్నది చూడాలి. ఆర్జీవీ అయితే ఇప్పటికే చిరుకు చురకలు అంటిస్తున్నాడు. భజన పరులు ఎక్కువయ్యారని కౌంటర్లు వేసిన సంగతి తెలిసిందే.