రంగమార్తాండ కోసం చిరంజీవి.. మాట సాయం చేస్తోన్న మెగాస్టార్

రంగమార్తాండ కోసం చిరంజీవి.. మాట సాయం చేస్తోన్న మెగాస్టార్

    డైరెక్టర్ కృష్ణ వంశీ అంటే చిరంజీవికి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఇక కృష్ణవంశీ అయితే నోరారా అన్నయ్య అంటూ చిరంజీవిని ఆప్యాయంగా పలకరిస్తుంటాడు. అలాంటి కృష్ణవంశీ కోసం చిరంజీవి ఏం చేయడానికైనా ముద్దుంటాడు. అందుకే రంగమార్తాండ సినిమా కోసం చిరంజీవి ముందుకు వచ్చాడు. కృష్ణవంశీ చాలా రోజుల తరువాత మళ్లీ ఓ ప్రయోగం చేసేందుకు రెడీ అయ్యాడు. మరాఠీ సినిమాకు రీమేక్‌గా రాబోతోన్న రంగ మార్తాండతో కృష్ణవంశీ కమ్ బ్యాక్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు.

    ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ వంటి అద్భుతమైన నటీనటులతో కృష్ణవంశీ చేస్తోన్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ వంటి వారు నటిస్తున్నారు. ఇక మేస్ట్రో ఇళయరాజా సంగీతం, సిరివెన్నెల పదజాలంతో మ్యూజిక్ ఓ రేంజ్‌లో ఉండబోతోంది. కళలకు ప్రాధాన్యమిచ్చే కుటుంబం. కేవలం కళలలే జీవితంగా బతికేవారి గురించి ఈ చిత్రం ఉండబోతోంది. అయితే కరోనా వల్ల ఈ సినిమా ఆలసమ్యైంది.

    తాజాగా సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. త్వరలోనే టీజర్ రాబోతోన్నట్టు కనిపిస్తోంది. ఈ టీజర్ కోసం చిరంజీవిని రంగంలోకి దించినట్టు కనిపిస్తోంది. టీజర్‌లో పాత్రల ఇంట్రడక్షన్ కోసం చిరంజీవి వాయిస్ ఇవ్వబోతోన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు చిరంజీవి డబ్బింగ్ చెబుతున్న ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

    Leave a Reply