- October 26, 2021
ఇప్పటి వరకు చేసింది చాలు!.. తండ్రిపై ఆకాష్ పూరి కామెంట్స్

పూరి జగన్నాథ్ తనయుడిగా ఆకాష్ పూరి చైల్డ్ ఆర్టిస్ట్ దగ్గరి నుంచి హీరోగా ఎదిగిన తీరు అందరికీ తెలిసిందే. హీరోగా అయితే సినిమాలు తీస్తున్నాడు. కానీ సక్సెస్ కొట్టలేకపోతోన్నాడు. ఈ సారి రొమాంటిక్ అంటూ కచ్చితంగా హిట్ కొట్టాలనే తెగ ఆరాటపడుతున్నాడు. ఎప్పటికైనా సరే కచ్చితంగా హిట్ కొడతాను.. మా నాన్న గర్వంగా తలెత్తుకునేలా చేస్తాను.. కాలర్ ఎగిరేసేలా చేస్తాను అని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆకాష్ ఎమోషనల్ డైలాగ్స్ కొట్టేశాడు.
తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆకాష్ మాట్లాడూతు కొన్ని విషయాలను చెప్పేశాడు. ఏం చేయమంటే అది చేస్తాను.. దూకమంటే దూకుతాను.. కానీ ఈ రొమాన్స్ కాస్త తగ్గించు నాన్నా అని అన్నాను. సినిమానే రొమాంటిక్.. అందులో రొమాన్స్ తగ్గించమంటావ్ ఏంట్రా అని అన్నారు. సెట్‌లో ఎన్నో సార్లు భయమేసింది. పారిపోదామా? అని అనిపించింది. స్క్రీన్ మీద రొమాన్స్ చేయడం చాలా కష్టం అని సినిమా గురించి తన తండ్రితో పెట్టిన చర్చ గురించి వివరించాడు.
ఈ చిత్రానికి కూడా నాన్ననే డైరెక్షన్ చేయమనొచ్చు కదా? అని మీడియా అడిగితే.. మా నాన్న నుంచి ఎంత దూరం పారిపోతే అంత మంచిదని అనిపిస్తుంటుంది. ఇప్పటికే మా నాన్న ఎంతో చేశారు. ఎంతో డబ్బులు పెట్టారు. ఇంత వరకు మా నాన్న చేసింది చాలు.. ఇక నేను మా నాన్నకు చేయాలి. తిరిగి ఇవ్వాలి. నేను సక్సెస్ కొట్టాక కావాలంటే మా నాన్నతో ఓ సినిమా చేస్తాను అని ఆకాష్ చెప్పుకొచ్చాడు. అనిల్ పాదురి తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 19న రాబోతోంది.