• August 9, 2023

Mahesh – Pawan: సోదరసమానుడైన మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెస్

Mahesh – Pawan: సోదరసమానుడైన మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెస్

    Mahesh -Pawan: శ్రీ మహేష్ బాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు చలన చిత్రసీమలో తనదైన పంథా కలిగిన అగ్రశ్రేణి కథానాయకుడు శ్రీ మహేష్ బాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ మహేష్ బాబు కథానాయకుడిగా అందుకున్న ఘన విజయాలు తెలుగు సినీ పరిశ్రమ వృద్ధికి ఎంతో దోహదపడ్డాయి. తండ్రి నటశేఖర కృష్ణ గారి అడుగుజాడల్లో వెళ్తూ, విభిన్న పాత్రల్లో మెప్పించే అభినయ సామర్థ్యం ఆయన సొంతం. సోదరసమానుడైన శ్రీ మహేష్ బాబు మరిన్ని విజయాలు అందుకోవాలని, సంపూర్ణ ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.