• November 26, 2021

Bigg Boss 5 Telugu : కుక్క తోక వంకర.. అమ్మ చెప్పినా వినని సిరి

Bigg Boss 5 Telugu : కుక్క తోక వంకర.. అమ్మ చెప్పినా వినని సిరి

    బిగ్ బాస్ ఇంట్లో జరిగే వ్యవహారాలు జనాలకు నచ్చడం లేదు. జనాలు అనుకోవడం సహజమే. కానీ కుటుంబ సభ్యులు, సొంత అమ్మకు కూడా అలాంటి అభిప్రాయమే వచ్చిందంటే సిరి, షన్నుల ఎలా హద్దులు దాటుతున్నారో అర్థం చేసుకోవచ్చు. నిన్న సిరి మదర్ శ్రీదేవీ వచ్చారు. ఇంట్లో తన కూతురుని చూసుకుంది. ఓ కూతురికి తల్లి చెప్పాల్సిన మాటలు చెప్పింది.

    కానీ సిరి మాత్రం చెవిన పెట్టలేదు. షన్ను సిరి హగ్స్ చేసుకోవడం నాకు నచ్చలేదు అని నిర్మొహమాటంగా అందరి ముందే చెప్పింది. ఇక చాల్లే అన్నట్టుగా నోర్మూయించింది. అయినా కూడా సిరిని స్వీటుగా గడ్డి పెట్టింది. షన్ను మీద సిరి ఎలాంటి ప్రేమను పెంచుకుంటుందో అమ్మకు అర్థమైనట్టుంది. అందుకే అన్నయ్య, తండ్రి, ఫ్రెండ్‌లా సాయం చేస్తున్నాడంటూ ఆ రిలేషన్‌కు ఓ క్లారిటీ ఇచ్చేందుకు చూసింది సిరి మదర్.

    కానీ సిరి మాత్రం ఆ మాటలకు హర్ట్ అయినట్టుంది. అలాంటివేం మాట్లాడకు అని అంది. షన్నుని పిలుస్తాను వాటి గురించి మాట్లాడకు అని తల్లికే సూచిస్తుంది. అయినా కూడా తల్లి మనసు కదా? ఆగలేకపోయింది. తన కూతురు ఎక్కడ షన్నుతో ఇంకా క్లోజ్ అవుతుందని భయపడిందో ఏమో గానీ అన్నయ్య, తండ్రి, ఫ్రెండ్ అంటూ మళ్లీ షన్ను సిరి రిలేషన్‌కు ఓ లెబుల్ ఇచ్చే ప్రయత్నం చేసింది.

    హగ్స్ నచ్చలేదు అని అంత మంచిగా చెప్పినా కూడా సిరి వినలేదు. అమ్మ అటు వెళ్లిందో లేదో ఇటు వచ్చి షన్ను ఒళ్లో పడుకుంది. హత్తుకుంది. కానీ షన్ను మాత్రం కాస్త దూరంగా ఉన్నట్టే కనిపించింది. సిరి మాత్రం నిజంగానే ఆపుకోలేకపోతోందా? అనే అనుమానాన్ని కలిగిస్తోంది. ఎంత కష్టపడి అమ్మ ఇంత వరకు తీసుకొచ్చింది.. అలాంటి అమ్మ చెబితే కూడా వినలేకపోతోంది. సిరికి అంతలా కళ్లు మూసుకుపోయినట్టుంది.

    Leave a Reply