Siri-Shrihan : బిగ్ బాస్ పెట్టిన చిచ్చు.. రెండు జంటల మధ్య దూరం

Siri-Shrihan : బిగ్ బాస్ పెట్టిన చిచ్చు.. రెండు జంటల మధ్య దూరం

    Deepthi Sunaina-Shanmukh Jaswanth బిగ్ బాస్ షో వల్ల ఎన్ని జీవితాలు తారుమారు అవుతాయో ఐదో సీజన్ ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. బిగ్ బాస్ షో కంటే ముందు దీప్తి సునయన షణ్ముఖ్‌లు ఎంతో గాఢ ప్రేమలో ఉన్నారు. ఒకరంటే ఒకరు ప్రాణం ఇచ్చుకునేంతగా ప్రేమించుకున్నారు. మరో వైపు శ్రీహాన్ సిరి జోడిది కూడా ఇదే పరిస్థితి. కానీ బిగ్ బాస్ మాత్రం రెండు జంటల మధ్య దూరాన్ని పెంచేశాడు.

    బిగ్ బాస్ ఇంట్లో సిరి షన్ను చేసి ఛండాలం గురించి అందరికీ తెలిసిందే. ఒకే దుప్పట్లో దూరడం, ఒకే బెడ్డు మీద పడుకోవడం, నిమిషానికి ఒకసారి హగ్గులు చేసుకోవడం వంటి పనులతో అందరికీ చిరాకు తెప్పించారు. అది ప్రేమ, స్నేహమా? అన్న క్లారిటీ వాళ్లకి లేకుండా పోయింది. చూసే జనాలకు కూడా అదేంటన్నది అర్థం కాకుండా పోయింది. చివరకు సిరి తల్లి అంత చక్కగా చెప్పినా కూడా వినిపించుకోలేదు. షన్నుకి హగ్గులు ఇవ్వకుండా ఆగలేకపోయింది. అయితే ముద్దులు మాత్రం ఆపేసింది.

    మొత్తానికి సిరి, షన్ను వ్యవహారం చాలా దూరం వెళ్లినట్టు కనిపిస్తోంది. అందుకే బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాక కూడా సిరి, షన్నులే కలిసి ఉంటారు. ఇంత వరకు దీప్తి సునయనతో షన్ను, శ్రీహాన్‌తో సిరి కనిపించలేదు. ఇక దీప్తి సునయన అయితే ఏకంగా బ్రేకప్ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మా ఇద్దరి దారులు వేరు అంటే చెప్పేసింది.

    దీపుకి ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే హక్కుంది.. ఆమె ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు అని షన్ను చెప్పేశాడు. ఇక శ్రీహాన్ సిరి జంట కూడా బ్రేకప్‌కి దగ్గరగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే సిరి బర్త్ డే సందర్బంగా శ్రీహాన్ పోస్ట్ పెడితే.. సిరి మాత్రం అస్సలు రియాక్ట్ కానట్టు కనిపిస్తోంది. మొత్తానికి సిరి మాత్రం ఎక్కడ కూడా శ్రీహాన్ గురించి మాట్లాడటం లేదు.

    బిగ్ బాస్ షో ద్వారా ఈ రెండు జంటల జీవితాలు తారుమారయ్యాయి. ఇక సిరి, షన్నులు ప్రయాణం ఎలా ముందుకు కొనసాగుతుందో చూడాలి. ఇంకా ఫ్రెండ్స్‌గా ఉన్నామని అంటారా? లేకు రిలేషన్ షిప్‌ను ముందుకు తీసుకెళ్తారా? అన్నది చూడాలి.

    Leave a Reply