• November 28, 2021

Siri Hanmanth-Shrihan : సిరి చాలా లక్కీ.. మనసులు గెలిచేసిన శ్రీహాన్

Siri Hanmanth-Shrihan : సిరి చాలా లక్కీ.. మనసులు గెలిచేసిన శ్రీహాన్

    Siri Hanmanth-Shrihan బిగ్ బాస్ ఇంట్లో సిరి ఎలాంటి పనులు చేస్తుందో అందరికీ తెలిసిందే. చూసే జనాలకు సిరి అంటే విరక్తి పుట్టేసింది. ఆమె చేస్తున్న పనులపై అందరికీ ఎవగింపు కలిగేలా ఉంది. ఎమోషన్స్ ఆపుకోలేక అలా చేస్తోందో ఏమో గానీ.. జనాలు తట్టుకోలేకపోతోన్నారు. కానీ సిరి ప్రియుడు, లవర్, ఫియాన్సీ శ్రీహాన్ మాత్రం ఎంతో కంపోజ్డ్‌గా ఉన్నాడు. ఎంతో మంచిగా అర్థం చేసుకున్నాడు.

    సిరి అంతలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నా కూడా నేనున్నాను అంటూ భరోసానిచ్చాడు. అతి చేయకు.. అంటూ కాస్త చురకలు అంటించినట్టే అంటించాడు. అంతే కాకుండా ఏమీ ఆలోచించకు..బయట నీ కోసం నేను.. అంటూ ఎంతో ప్రేమగా చెప్పాడు. షన్ను, సిరి రిలేషన్ నేను అర్థం చేసుకుంటాను.. నాకు షన్ను చాలా ఏళ్ల నుంచి తెలుసు.. సిరి కంటే ముందే మేం ఫ్రెండ్స్ అంటూ అసలు విషయం చెప్పాడు.

    నేను అక్కడ సిరికి తోడు లేకపోయినా కూడా నా స్థానంలో ఓ ఫ్రెండ్‌లా ఉండి తోడుంటున్నాడు. చాలా థ్యాంక్స్ షన్ను. అని వారి రిలేషన్‌ను గౌరవించాడు. ఇలా ఎంతో హుందాగా మాట్లాడాడు శ్రీహాన్. అతని మెచ్యూర్టి, మంచిదనం, హుందాతనం ముందు సిరి పనికి రానట్టుంది. శ్రీహాన్ ముందు సిరి అసలు కనిపించనే లేదు. శ్రీహాన్ అక్కడెక్కడో ఆకాశంలో ఉంటి సిరి మాత్రం పాతాళంలో ఉన్నట్టు అనిపించింది.

    సిరిని ఎంత ప్రేమగా చూసుకుంటాడు.. ఎంతప్రేమిస్తాడు అనేది ఆ పాటలో చెప్పకనే చెప్పేశాడు. ఎంతో ఎమోషనల్ అయిన శ్రీహాన్.. సిరి మీదున్న ప్రేమను అందరి ముందే ప్రకటించేశాడు. మొత్తానికి సిరి లవర్ అని ఇంత వరకు పిలిచేవారు. కానీ ఇప్పుడు శ్రీహాన్ లవర్ సిరి అనే వరకు వచ్చేశాడు. అలాంటి వాడు భర్తగా రానుండటం సిరి లక్కీ.

    Leave a Reply