• November 16, 2021

‘ఉడాల్’ అన్న ఫ్యామిలీ పిక్.. షన్ను అభిమానుల రచ్చ.. నెటిజన్ల సపోర్ట్

‘ఉడాల్’ అన్న ఫ్యామిలీ పిక్.. షన్ను అభిమానుల రచ్చ.. నెటిజన్ల సపోర్ట్

    బిగ్ బాస్ సీజన్ నడిస్తున్నంత కాలం కంటెస్టెంట్ల అభిమానుల హడావిడి ఉంటూనే ఉంటుంది. అయితే బిగ్ బాస్ ఫీవర్ ప్రస్తుతం ఎక్కువైంది. అయితే బిగ్ బాస్ షోను చూసే వారి సంఖ్య కంటే వాటి మీద రివ్యూలు, ట్రోల్స్, మీమ్స్ వారి మీద నెటిజన్ల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అలా బిగ్ బాస్ రివ్యూలతో యూట్యూబ్‌లో చాలా మంది ఫేమస్ అయ్యారు. అందులో ఆది రెడ్డి అనే అతను కూడా ఉన్నాడు. ఉడాల్ అనే ఊత పదంతో ఆది రెడ్డి ఫేమస్ అయ్యాడు.

    అది పాజిటివా? నెగిటివ్ పదమా? అన్నది పక్కన పెడితే ఇప్పుడు నెట్టింట్లో ఉడాల్ ఫేమస్ అయిపోయింది. ఆది రెడ్డి రివ్యూలు లీకులు ఎంతగా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే. ఇక నెట్టింట్లో బిగ్ బాస్ కంటెస్టెంట్ల అభిమానులు చేసే హడావిడిలో ఆది రెడ్డి పేరు కచ్చితంగా ఉంటుంది. కొంత మంది ఆది రెడ్డిని తిడతారు. ఇంకొందరు పొగుడుతారు. సోషల్ మీడియా అన్నప్పుడు కచ్చితంగా మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది.

    అయితే ఇప్పుడు మాత్రం ఆది రెడ్డి మీద షన్ను అభిమానులు కాస్త గుర్రుగా ఉన్నారు. సన్నీకి వత్తాసు పలికినట్టు రివ్యూలు ఉంటున్నాయని, సన్నీ పీఆర్ టీం దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాడంటూ ఆరోపిస్తుంటారు. తన నిజాయితీ ఏంటో కంటెస్టెంట్ల ఫ్యామిలీలను అడిగితే తెలుస్తుందని ఆది రెడ్డి సవాల్ విసిరాడు. తాను ఎవ్వరికీ లొంగను, తనకు నచ్చిందే చెబుతాను.. అనిపించిందే మాట్లాడతాను అంటూ ఆది రెడ్డి పిచ్చి పిచ్చి ఆరోపణలపై కౌంటర్లు వేస్తుంటాడు.

    అయితే తాజాగా ఆది రెడ్డి తన ఫ్యామిలీ పిక్ షేర్ చేశాడు. ఈ మధ్యే ఆది రెడ్డి భార్య సీమంతం వేడుక జరిగింది. దానికి సంబంధించిన ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫోటో మీద నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. షన్ను అభిమానులు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఆది రెడ్డితో, ఆయన రివ్యూలతో ప్రాబ్లం ఉంటే ఆయన మీద కామెంట్ చేయండి కానీ ఇలా ఫ్యామిలీ మీద ఎందుకు చేస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎవరు ఎన్ని అన్నా కూడా ఆది రెడ్డి రివ్యూలు నిష్పక్షపాతంగా ఉంటాయని నెటిజన్లు అంటున్నారు.

    Leave a Reply