• December 10, 2021

Shanmukh Jaswanth : నేను మూడిస్ట్‌గాడిని!.. ఎట్టకేలకు ఒప్పుకున్న షన్ను

Shanmukh Jaswanth : నేను మూడిస్ట్‌గాడిని!.. ఎట్టకేలకు ఒప్పుకున్న షన్ను

    Shanmukh Jaswanth Siri Hanmanth బిగ్ బాస్ షో అందరికీ సరిపోదు. బిగ్ బాస్ ఇంట్లో ఉండటం అంటే మామూలు విషయం కాదు. అన్ని రకాల ఎమోషన్స్‌ను, అన్ని రకాల విమర్శలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొందరు మాత్రం తన పరిధిలోనే ఉంటారు. బయటి ప్రపంచాన్ని పట్టించుకోలేదు. వేరే వ్యక్తులను కలిసిపోలేరు. అలాంటి వారికి బిగ్ బాస్ ఇళ్లు అస్సలు సూట్ అవ్వదు.

    అలాంటి ఓ వింత కారెక్టరే షణ్ముఖ్ జశ్వంత్ అలియాస్ షన్ను. యూట్యూబ్‌లో షన్ను సూపర్ స్టార్. అందులో ఎలాంటి డౌటానుమానం లేదు. సూర్య, సాఫ్ట్ వేర్ డెవలవ్‌పర్ వెబ్ సిరీస్‌లో ఫుల్ ఫేమస్ అయ్యాడు. యూట్యూబ్‌కు స్టార్‌గా మారిపోయాడు. తెరపై కనిపించడం వేరు.. బిగ్ బాస్ ఇంట్లో ఉండటం వేరు. ఈ ఫ్లాట్ ఫాం షన్నుకి ఏ మాత్రం సెట్ కాదు.

    ఈ విషయాన్ని షన్నునే పలు మార్లు చెప్పుకొచ్చాడు. ఇక తన మూడిస్ట్ గురించి షన్నునే బయటపడ్డాడు. షన్ను అలా మూడిస్ట్‌గా ఉండటమే కాకుండా.. సిరిని కూడా దారుణంగా ఎమోషనల్‌గా అత్యాచారం చేస్తున్నాడు. సిరిని ఎవ్వరితోనూ కలవనివ్వడు.. వేరే వాళ్లతో సిరి క్లోజ్‌గా ఉంటే తట్టుకోలేడు.. ఇన్ సెక్యూర్‌గా ఫీలవుతాడు.. ఫ్రెండ్ అంటాడు.. మళ్లీ ఇలాంటి పనులే చేస్తాడు.

    షన్ను వల్ల సిరి కూడా ఒక జానర్‌లోనే ఫిక్సయింది. సిరి అంటే బిగ్ బాస్ ఇంట్లో షన్ను మాత్రమే గుర్తుకు వస్తాడు.. షన్నుకి ఇచ్చిన హగ్గులు మాత్రమే గుర్తుకు వస్తాయి. అలా కాకుండా షన్నుతో స్నేహం చేస్తూనే ఇంట్లో వాళ్లందరితో కలిసి మెలిసి ఉండేందుకు ప్రయత్నిస్తే.. ఆమె జర్నీ వేరేలా ఉండేది. ఇక షన్ను కూడా తన కంఫర్ట్ జోన్‌లోంచి బయటకు వచ్చేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదు.

    ఎప్పుడూ ఏదో ఒకటి పోగొట్టుకున్న వాడిలో, లోలోపల భయపడుతున్న వాడిలా కనిపిస్తుంటాడు. ఇక నిన్నటి సూపర్ స్టార్స్ టాస్కుల్లోనూ షన్ను ప్రవర్తన అంతే ఉంది. సిరి కాస్త జాలీగా అందరితో కలిసి మెలిసి ఉంటే తట్టుకోలేకపోయాడు. సిరితో సన్నీ డ్యాన్సులు వేయడంతో షన్నుకి కాలినట్టుంది. మొత్తానికి సిరి అయితే షన్నుతో ఉండకపోతే హ్యాపీగా అందరితో కలిసి మెలిసి నవ్వుతూ ఉంటుందన్న మాట.

    ఇదే విషయాన్ని షన్ను అనేశాడు. నువ్ నాతో ఉంటే ఇలానే ఉంటుంది.. వెళ్లి వాళ్లతోనే ఉండు.. నేను మూడిస్ట్‌ని.. నాతో ఉంటే ఇలానే ఉంటుంది.. అంటూ ఇలా తన గురించి ఓపెన్ అయిపోయాడు. నిజంగానే షన్ను ఈ బిగ్ బాస్ ఇంటికి అంతగా పనికి రాడు. ఎందుకంటే జోకులు వేసినా తీసుకోలేడు. ఎవరైనా సరదాగా ఏదైనా అంటే కూడా తట్టుకోలేడు. మరి ఇలాంటి షన్ను బిగ్ బాస్ ఫినాలే రేసులో కూడా ఉంటాడు. అప్పుడు ఫలితం ఎలా వస్తుందో చూడాలి.

    Leave a Reply