- December 8, 2021
Bigg Boss 5 Telugu : షన్ను ఎక్కువ ఊహించుకుంటున్నాడా?.. ప్రతీసారి అదే డైలాగ్!

Shanmukh Jaswanth యూట్యూబ్ స్టార్ అయిన షన్ను ప్రతీసారి బిగ్ బాస్ ఇంట్లో ఒక డైలాగ్ వాడుతుంటాడు. నన్ను కమెడియన్‌ను చేద్దామని అనుకుంటున్నారా? అని అంటాడు. అంటే తనది తాను హీరోగా ఊహించుకుంటున్నాడా? అనే అనుమానం కూడా జనాల్లో కలుగుతోంది. యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లతో ఫేమస్ అయిన షన్ను.. తాగి బండి నడిపిన కేసుతో మొత్తం పోగొట్టుకున్నాడు. ఒళ్లు తెలియకుండా అక్కడ ప్రవర్తించిన తీరు, వాటికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
అలా వచ్చిన నెగటివిటీని పోగొట్టుకునేందుకు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తున్నాను అని ప్రారంభం రోజు స్టేజ్ మీద పరోక్షంగా చెబుతాడు షన్ను. కానీ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన తరువాత షన్ను చేసింది మాత్రం ఏమీ లేదు. తన యాటిట్యూడ్ చూపిస్తూ.. సిరిని తన కంట్రోల్‌లో పెట్టుకోవడం, సిరి హగ్గులు ఇస్తే తీసుకోవడం, ముద్దులు పెడితే పెట్టించుకోవడం తప్పా చేసిందేమీ లేదు.
పైగా వేరే వాళ్లు కామెడీ చేసినా కూడా తీసుకోలేడు. ఏమైనా వెకిలి అంటూ ఏడుస్తాడు. కామెడీ అంటే ఎదుటి వాళ్లను వెకిలి చేయడమా? అని తెగ హర్ట్ అవుతాడు. ప్రతీ టాస్కులోనూ షన్నుతో ఇదే సమస్య. అందరూ కామెడీగా తీసుకుని, హాయిగా ఎంజాయ్ చేస్తుంటే షన్ను మాత్రం మొహం మాడ్చుకుంటాడు. నిన్నటి ఎపిసోడ్‌లోనూ సన్నీ దెబ్బకు షన్ను మూతి మాడ్చుకున్నాడు.
అప్పడం ఎపిసోడ్‌లో షన్నులా సన్నీ నటించాడు. ఇక సిరి హగ్గులతో నలిపేసినట్టుగా సన్నీ కాస్త ఓవర్ యాక్షన్ చేశాడు. కానీ దాన్ని కూడా అంతలా తలకు ఎక్కించుకుని, నెగెటివ్ చేయాల్సిన పని లేదు. కామెడీగా తీసుకుని వదిలేయోచ్చు. ఆ ఇద్దరూ హత్తుకుంటే తప్పు లేదు కానీ, సన్నీ చేసి చూపిస్తే మాత్రం షన్నుకి కాలిపోయింది. అసలు షన్ను ఎప్పుడూ ఇలా మూడీగా ఉంటూ కామెడీ చేసే వాళ్లని కూడా ఓర్వలేకపోతోన్నాడు. గతంలో ఓ సారి యాంకర్ రవి విషయంలోనూ ఇలానే షన్ను సీరియస్ అయ్యాడు.
ఇక నేటి ఎపిసోడ్‌లోనూ షన్నుకి సిరి గట్టిగానే గడ్డిపెట్టినట్టు కనిపిస్తోంది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులను టాస్కుల్లా చూడాలి.. అంటూ సెటైర్ వేసింది. ఆ మాట కూడా షన్ను తీసుకోలేకపోయాడు. షన్ను చెబితే సిరి మాత్రం అన్నీ వినాలి.. చేయాలి.. కానీ సిరి ఒక్క మాట చెప్పినా షన్ను వినడు. ఏంటో ఈ నిబ్బ మైండ్ సెట్ అని జనాలు నవ్వుకునే వరకు షన్ను వచ్చాడు.