• December 27, 2021

Shanmukh Jaswanth : బ్లాక్ చేసింది అయినా నేను వదలను.. దీప్తితో బ్రేకప్‌ రూమర్లపై షన్ను

Shanmukh Jaswanth : బ్లాక్ చేసింది అయినా నేను వదలను.. దీప్తితో బ్రేకప్‌ రూమర్లపై షన్ను

    Deepthi Sunaina బిగ్ బాస్ షో ప్రభావం అనేది జీవితాలపై చాలా గట్టిగా ఉంటుంది. బిగ్ బాస్ షో వల్ల ఎక్కడికో ఎదిగిన వారున్నారు.. ఇంకా ఎంతో దిగజారిన వారున్నారు. కెరీర్ అంతా కూడా యూటర్న్ తిప్పేస్తుంది బిగ్ బాస్ షో. అలా ఈసారి జరిగిన ఐదో సీజన్ దెబ్బకు చాలా మంది జీవితాలు మారిపోయాయి.మరీ ముఖ్యంగా షణ్ముఖ్, సిరి లైఫ్‌లు మాత్రం మారిపోయాయి.

    షన్నుకి అంతకు ముందున్న పాజిటివ్ ఇమేజ్ ఇప్పుడు అంతగా లేదు. షన్నుకి సిరి టాపిక్‌లో కాస్త నెగెటివిటీ పెరిగింది. ఇక సిరి ఇమేజ్ అయితే పూర్తిగా డ్యామేజ్ అయింది. ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూనే పిచ్చి చేష్టలు వేశారంటూ జనాలు ఆడిపోసుకున్నారు. నాన రకాలుగా ట్రోల్ చేశారు. అయితే తామిద్దరం ఫ్రెండ్స్ మాత్రమేనని, అవి ఫ్రెండ్ షిప్ హగ్గులేనని చెబుతూ ఉంటారు.

    బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాక దీప్తి సునయను షన్ను కలవలేదు.. శ్రీహాన్ కూడా తన ప్రియురాలు సిరిని కలవలేదు. మొత్తానికి ఏదో జరిగిందనే విషయం మాత్రం అర్థమవుతోంది. అయితే తాజాగా ఈ రూమర్లపై షన్ను స్పందించాడు. నిన్న సాయంత్రం షన్ను ఇన్ స్టాగ్రాంలో లైవ్‌లోకి వచ్చాడు. అయితే అందరూ దీప్తి గురించి ప్రశ్నలు సంధిస్తుందడటంతో అసలు విషయం చెప్పాడు.

    దీప్తి అలిగితే సైలెంట్‌గా ఉంటుంది.. బ్లాక్ చేస్తుంది.. నన్ను బ్లాక్ చేసింది.. తను అంతే.. అయినా నేను వదలను.. ఈ పచ్చబొట్టు ఉన్నంత వరకు నేను దీప్తిని వదలను.. కాకపోతే కొంచెం టైం ఇస్తాను. ఆమె ప్రశాంతంగా, సంతోషంగా ఉండటమే నాకు కావాలి.. నేను దీపు కలుస్తాను.. కలవకపోతే.. ఆమెను వదిలేస్తే.. మీరంతా నన్ను రోడ్డు మీదే కొట్టేసేలా ఉన్నారు అంటూ నవ్వేశాడు షన్ను.

    Leave a Reply