- December 5, 2021
Shanmukh Jaswanth : వేరే వాళ్ల గురించి అవసరం లేదు!.. షన్ను బ్రదర్ సంపత్ క్లారిటీ

బిగ్ బాస్ షో అంతా కూడా ఒకెత్తు అయితే.. సోషల్ మీడియాలో రివ్యూలు, ట్రోల్స్, మీమ్స్, పీఆర్ టీం చేసే హంగామా అంతా మరో ఎత్తు. బిగ్ బాస్ ఆటను ప్రభావితం చేసే స్థాయికి ఇవన్నీ చేరుకున్నాయి. కొందరు బిగ్ బాస్ షోను ఫాలో అవ్వరు. కేవలం రివ్యూలు, ట్రోల్స్, మీమ్స్‌ను చూసి ఎంజాయ్ చేస్తుంటారు. వాటిని ఆధారంగా చేసుకుని ఓట్లు వేస్తుంటారు. అలా మొత్తానికి బిగ్ బాస్ ఆటను సోషల్ మీడియా బాగానే ప్రభావితం చేస్తోంది.
అందుకే కంటెస్టెంట్ల బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే ముందే తమకంటూ ఓ పీఆర్ టీంను మాట్లాడుకుని వెళ్తుంటాయి. సపోర్టర్స్‌తో ముందే మాట్లాడుకుంటారు. అలా ఒక్కో కంటెస్టెంట్ కోసం బయట ఎంతో మంది పని చేస్తుంటారు. అయితే షణ్ముఖ్ జశ్వంత్ యూట్యూబ్ స్టార్. సోషల్ మీడియాలో అతనికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆటతో నిమిత్తం లేకుండా షన్ను గెలుస్తాడని షో ఆరంభంలోనే అంతా అనుకున్నారు.
ఎందుకంటే అతని ఫ్యాన్స్ అంతా ఓట్లు వేస్తే.. వార్ వన్ సైడ్ అవుతుందని అందరికీ తెలిసిందే.అయితే ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారనే ఆసక్తి అందరిలోనూ ఎక్కువైంది. కంటెస్టెంట్ల తరుపున బయట ప్రచారాలు కూడా ఎక్కువే అవుతున్నాయి. ఈ క్రమంలో షన్ను బ్రదర్ సంపత్ తన తమ్ముడి కోసం నిలబడ్డాడు.
షన్ను పాయింట్ ఆఫ్ వ్యూలోనే తన రివ్యూ ఉంటుందని, షన్ను సపోర్టర్స్ కోసం మాత్రమే ఈ వీడియోలు చేస్తున్నానని, మిగతా కంటెస్టెంట్ల గురించి తనకు అవసరం లేదని సంపత్ తెలిపాడు. అయితే ఎవరైనా షన్ను గురించి, ఆట గురించి మాట్లాడితే మాత్రం తాను క్లారిటీ ఇస్తాను.. అని చెప్పేశాడు. మొత్తానికి ఇక బిగ్ బాస్ తుది పోరు దగ్గర పడుతుండటంతో ప్రతీ ఒక్క కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఓట్ల సునామీని సృష్టించాలని తహతహలాడుతున్నారు.