- November 7, 2021
దీప్తి సునయన మరీ అంతలా చేస్తుందా?.. షణ్ముఖ్‌కు బాగా అలవాటైనట్టుంది!

బిగ్ బాస్ ఇంట్లో షణ్ముఖ్ జశ్వంత్ ఇప్పుడిప్పుడే ఆటను ఆడటం మొదలుపెట్టాడు. కెప్టెన్ అయ్యాక చాలా మారిపోయాడు. అందరితోనూ కలిసి ఉంటున్నాడు. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటున్నాడు. ఫ్రెండ్స్ అనే తేడా లేకుండా ఉంటున్నాడు. అయితే అలా ఉండటం, టాస్క్‌లో ఒకేలా ఆడటంతో సిరి కాస్త హర్ట్ అయింది. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో తనను సపోర్ట్ చేయలేదు, తన మీదకు బాల్స్ విసిరాడంటూ సిరి అలిగింది. కాయిన్స్ టాస్క్‌లో మేం కావాలని చేయలేదు, అలా జరిగిపోయింది. కానీ ఇక్కడ మాత్రం వాడు కావాలనే చేశాడంటూ షన్ను గురించి నానా రకాలుగా కామెంట్ చేసింది సిరి.
ఫేక్ ఫ్రెండ్, ఫేక్ ఫ్రెండ్ షిప్ అంటూ ఎన్నెన్నో మాటలు అనేసింది. అయితే షన్ను ఎన్ని రకాలుగా ట్రై చేసినా రెండు రోజులు మాట్లాడలేదు. షన్ను వస్తుంటే సిరి వెళ్లిపోవడం, మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే.. తిరస్కరించడం, మొహం తిప్పుకుని పోవడం వంటివి చేస్తూ వచ్చింది. ఇక చివరకు బెడ్‌రూంలోనూ అలానే చేసింది. మామూలుగా అయితే ఇద్దరూ ఒకే బెడ్డు మీద, లేదా పక్కపక్కన బెడ్డు మీద పడుకుంటారు. షన్ను మీద కోపం ఉండే సరికి బెడ్ వద్దకు రాలేదు.
మోజ్ రూంలోని సోఫాలోనే పడుకుంది. దీంతో షన్ను అర్థం చేసుకుని.. నేను ఇక్కడ పడుకుంటాను. నువ్ బెడ్ రూంలో పడుకో అని అన్నాడు. సరే అంటూ సిరి వెళ్లిపోయింది. అలా షన్ను మోజ్ రూంలోనే పడుకున్నాడు. అలా పడుకున్న షన్ను సిరి అలక గురించి పాట పాడుకున్నాడు. అయినా దీపు అలిగితే అది వెరే లెవెల్.. ఇలా ఉండదు.. ఎవ్వరూ భరించలేదు.. దీపునే భరిస్తే ఇక ఎవ్వరినైనా భరించొచ్చు అని షన్ను తన మనసులో అనుకున్నాడు. అంటే షన్నును దీప్తి సునయన ఓ రేంజ్లో ఆడుకుంటుందని అర్థమవుతోంది. అలక పాన్పు ఎక్కితే అంత త్వరగా దిగదని తెలుస్తోంది.