• November 15, 2021

రోహిణికి షన్ను ఫ్యాన్స్ అసభ్యకర సందేశాలు!.. పిచ్చోళ్లు అయ్యేది మీరే అంటూ ఫైర్

రోహిణికి షన్ను ఫ్యాన్స్ అసభ్యకర సందేశాలు!.. పిచ్చోళ్లు అయ్యేది మీరే అంటూ ఫైర్

    బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్ల మధ్యన గొడవలు జరుగుతాయి. జరగకపోయినా బిగ్ బాస్ దగ్గరుండి మరీ పెట్టిస్తాడు. ఎక్కడ దొరుకుతారా? అని చూస్తుంటాడు. అలా అక్కడ పరిస్థితుల వల్ల ఎవరో ఒకరు.. మరొకరికి శత్రువులుగా, మిత్రులుగా మారుతారు. అవన్నీ కూడా బిగ్ బాస్ ఇంటి వరకే ఉంటాయి. తరువాత అంతా ఒక్కటే అవుతారు. కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్ల అభిమానులు మాత్రం వర్గాలుగా చీలి రచ్చ రచ్చ చేస్తుంటారు.

    మా అభిమాన కంటెస్టెంట్‌ను అలా అంటారా? అని ఫ్యాన్ వార్ మొదలవుతుంది. ఇక ఇందులో తమకు సపోర్ట్ చేసే సెలెబ్రిటీలను కూడా వదలరు. ప్రస్తుతం సన్నీ, షన్ను ఫ్యాన్స్ మధ్య పోటీ జరుగుతోంది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తున్నారు. ట్వీట్ల యుద్దాన్ని మొదలుపెట్టారు. మొత్తానికి ఇరు కంటెస్టెంట్ల అభిమానులు మిలియన్ ట్వీట్లను కొట్టేశారు. తమ సత్తాను చాటారు. అయితే సన్నీ, షన్ను అభిమానులు కాస్త హద్దులు దాటుతున్నారు.

    తమ తమ అభిమాన కంటెస్టెంట్లను ప్రేమించడం, సపోర్ట్ చేయడంలో తప్పు లేదు. కానీ మిగతా కంటెస్టెంట్లను కించపరచడం, వారి అభిమానులను ధూషించడమే తప్పు. ఇదే విషయాన్ని రోహిణి తాజాగా చెప్పుకొచ్చింది. రోహిణి.. సన్నీకి మద్దతు తెలుపుతోంది. ఎందుకంటే సన్నీ ఏంటో వ్యక్తిగతంగా తెలుసు.. అతను చాలా మంచివాడంటూ రోహిణి చెప్పుకొచ్చింది. ఎవరు ఎలా అనుకున్నాం ఏమని అనుకున్నా కూడా నేను సన్నీకే సపోర్ట్ చేస్తాను అని రోహిణి చెప్పేసింది.

    అది కేవలం ఆట.. బయటకు వచ్చాక వారంతా కూడా ఫ్రెండ్స్ అవుతారు.. అది మీరు మరిచిపోకండి.. పిచ్చోళ్లు అయ్యేది మీరే.. నిజం చెబుతున్నా.. మీరు తెలుసుకోకపోతే కష్టం.. అవును నేను సన్నీని సపోర్ట్ చేస్తున్నా.. మీకు సన్నీ ఎలా అనిపించినా నాకు నష్టం లేదు.. నేను ఎప్పుడూ సన్నీకే సపోర్ట్ చేస్తాను. అతను చాలా మంచి వాడు.. నాకు పర్సనల్‌గా తెలుసు.. ఇక చివరగా నేను చెప్పేది ఏంటంటే.. నచ్చిన వాళ్లను సపోర్ట్ చేయండి.. నచ్చని వాళ్లను పట్టించుకోకండి.. అంతేగానీ పిచ్చి పిచ్చిగా నెగెటివ్‌గా బూతులతో మెసెజ్ పెట్టొద్దు. అది సన్నీకి అయినా వేరే వేరే కంటెస్టెంట్లకి అయినా సరే.. చాలా మంది నాకు పిచ్చి పిచ్చి మెసెజ్‌లు చేస్తున్నారు వాళ్లకి చెబుతున్నాను అంటూ రోహిణి ఓ పోస్ట్ చేసింది.

     

    Leave a Reply