• December 10, 2021

Bigg Boss 5 Telugu : మచ్చా కోసం చిచ్చా!.. సన్నీకి రాహుల్ సపోర్ట్

Bigg Boss 5 Telugu : మచ్చా కోసం చిచ్చా!.. సన్నీకి రాహుల్ సపోర్ట్

    VJ Sunny-Rahul Sipligunj బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్లు షోను బాగానే ఫాలో అవుతుంటారు. గత సీజన్ కంటెస్టెంట్లు ఈ ఐదో సీజన్ మీద చాలానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ గత ఏడాది బిగ్ బాస్ కంటెస్టెంట్ల మీద ఎలాంటి కామెంట్లు చేశాడో అందరికీ తెలిసిందే. అభిజిత్‌‌కు వ్యతిరేకంగా రాహుల్ కొన్ని పోస్ట్‌లు పెట్టాడు. ఇంట్లో టాస్కులు చేయకుండా ఖాళీగా ఉండే వాళ్లను తోసి అవతల పారేయండంటూ కాస్త ఘాటుగానే స్పందించాడు రాహుల్.

    అలా నాడు రాహుల్ చేసిన కామెంట్లు నెట్టింట్లో బాగానే వైరల్ అయ్యాయి. మళ్లీ ఇప్పుడు రాహుల్ బిగ్ బాస్ ఐదో సీజన్ మీద స్పందించాడు. సన్నీకి సపోర్ట్ చేస్తూ రాహుల్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. అసలే బిగ్ బాస్ షో ఫైనల్ స్టేజ్‌కు వచ్చింది. ఈ ఒక్క వారం గడిస్తే.. వచ్చే ఆదివారం ఫినాలే ఎపిసోడ్ ఉండబోతోంది. ఇప్పుడు ఇంట్లో ఆరుగురున్నారు.

    ఈ ఆదివారం ఒకరు ఎలిమినేట్ కాబోతోన్నారు. సిరి, కాజల్ నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ కాబోతోన్నట్టు తెలుస్తోంది. అయితే రాహుల్ మాత్రం తన సపోర్ట్‌ను సన్నీకి ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఇంట్లో ట్రూ ఎమోషన్స్ చూపిస్తూ ఎంటర్టైన్ చేస్తున్న సన్నీకే నా ఓటు అంటూ రాహుల్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇక మచ్చా కోసం చిచ్చా రంగంలోకి దిగాడంటూ నెటిజన్లు కామెంట్లతో హెరెత్తిస్తున్నారు.

    అయితే ఇలా రాహుల్ పోస్ట్ పెట్టడంతో షన్ను అభిమానులు హర్ట్ అయ్యారు. నువ్ ఏమైనా ఎంటర్టైన్ చేశావా? నువ్ ఎలా విన్ అయ్యావ్ అంటూ రాహుల్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోలింగ్‌ను పక్కన పెడితే.. రాహుల్ బాటలోనే అషూ రెడ్డి కూడా నడిచింది. తన సపోర్ట్‌ను సన్నీకే అంటూ ప్రకటించింది. మొత్తానికి సన్నీకి మాత్రం ఇప్పుడు ఫుల్ క్రేజ్ పెరుగుతోంది. టాప్ 2లో సన్నీ ఉంటాడని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇక విన్నర్ ఎవరు అవుతారనేది ఇంకో వారంలో తేలనుంది.

    Leave a Reply