• November 10, 2021

Bigg Boss 5 Telugu : మానస్ మీద పడి పడి ముద్దులు.. బరితెగించిన ప్రియాంక

Bigg Boss 5 Telugu : మానస్ మీద పడి పడి ముద్దులు.. బరితెగించిన ప్రియాంక

    బిగ్ బాస్ ఇంట్లో ప్రియాంక ఈ మధ్య చేస్తోన్న చేష్టలు అందరికీ విరక్తిని పుట్టిస్తున్నాయి. బిగ్ బాస్ ఇంట్లో ఉంటోంది. కానీ ఏం చేస్తోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. మానస్ చుట్టూ తిరగడం, మానస్ వెనకాలే పడటం, ఇంట్లో ఉండి వంటలు వండటం, ఏడ్వటం ఇదే ఆమె రొటీన్ పని అయినట్టు కనిపిస్తోంది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో అయితే ప్రియాంక శ్రుతి మించిపోయింది. మీద పడి ముద్దులుపెట్టేస్తోంది. ముద్ద కావాలా? ముద్దు కావాలా? అంటూ కొంటెగా అడిగింది.

    రవి, జెస్సీ పేర్లను నేను చెబితే.. జెస్సీని జైల్లో వేసింది రవిని కాపాడింది అని ప్రియాంక అసలు రంగు నాకు తెలిసిందంటూ సన్నీకి మానస్ చెప్పుకొచ్చాడు. ఆ ముందు రాత్రే.. రవిని నామినేట్ చేస్తాను అని చెప్పిన ప్రియాంక ఉదయం మాత్రం అలా చేసిందంటూ ప్రియాంక గురించి తెలిసిందంటూ ఆమెకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఇక ప్రియాంక ఎంత వచ్చి మాట్లాడినా కూడా మాట్లాడలేదు. కానీ చివరకు ఏదో అలా మళ్లీ మాట్లాడేశాడు. అయితే ఆ ఎగ్జైట్మెంట్‌లో ప్రియాంక శ్రుతి మించిపోయింది.

    మీద పడి ముద్దులు పెట్టేస్తోంది. స్విమ్మింగ్ పూల్ పక్కన ఉన్న ఆ సోఫాల్లో కాజల్, మానస్, ప్రియాంక ఉన్నారు. మానస్‌కు ప్రియాంక తినిపించే క్రమంలో ముద్దు కావాలా? ముద్ద కావాలా? అని ఆట పట్టింది. ఆ ముద్దులాటలకు కాజల్ సంచాలక్ అంటా. మానస్ మీద పడి మరీ ముద్దులు పెట్టేసింది. ఇలా ప్రియాంక చేస్తోన్న చేష్టలకు చూసే వీక్షకులు తలపట్టుకుంటున్నారు. త్వరగా ప్రియాంకను ఎలిమినేట్ చేసి పారేయండని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

     

    Leave a Reply