• December 6, 2021

Bigg Boss 5 Telugu : వచ్చిందండి వయ్యారి!.. జెస్సీని ముద్దులతో ముంచెత్తిన ప్రియాంక

Bigg Boss 5 Telugu : వచ్చిందండి వయ్యారి!.. జెస్సీని ముద్దులతో ముంచెత్తిన ప్రియాంక

    Priyanka-Jaswanth Padala బిగ్ బాస్ ఇంటి నుంచి ప్రియాంక వెళ్లిపోవడంతో ఎంతో మంది ఊపిరి పీల్చుకున్నారు. ఆమెను మానస్ మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా భరించారు. ఆమె చేష్టలకు అందరూ విసిగిపోయారు. నిత్యం మానస్ వెనకాల పడిపోవడం, ముద్దులు పెట్టడం, హత్తుకోవడం చేస్తూ పిచ్చి పిచ్చి చేష్టలతో విసిగెత్తించింది. ఆటలేమీ ఆడకుండా ఇంట్లో రొమాన్స్ చేస్తూ ఉండిపోయింది.

    ప్రియాంక మధ్యలో ముగ్గురితో ట్రాక్ నడిపించిన సంగతి తెలిసిందే. మానస్, శ్రీరామచంద్ర, జెస్సీ అంటూ ముగ్గురితో సరసాలు ఆడింది. ముద్దులతో ముంచెత్తింది. ఇక జెస్సీ అయితే ఏకంగా ప్రియాంక బుగ్గ మీద ముద్దుపెట్టేశాడు. అలా ప్రియాంక జెస్సీ ట్రాక్ కూడా కొన్ని రోజులు నడిచింది. వెళ్తూ వెళ్తూ జెస్సీ.. ప్రియాంకను అనాల్సిన మాటలన్నీ అనేశాడు.

    సీక్రెట్ రూం నుంచి అన్నీ చూశాను. ఇక్కడికి ఎందుకు వచ్చావ్.. ఏం చేస్తున్నావ్.. నీ ఆట నువ్ ఆడుకో.. ఎవరైనా చూస్తే.. ప్రియాంక ఇన్ని రోజులు ఉందేంట్రా బాబు దీన్నిఎవడు ఉంచాడు అనేట్టు ఉండకూడదంటూ చీవాట్లు పెట్టేశాడు జెస్సీ. అన్ని మాటలు అన్నా కూడా ప్రియాంక మాత్రం మారలేదు. మానస్ వెంటే పడుతూ.. ఆటను ఆడకుండా ఉండిపోయింది.

    మొత్తానికి ప్రియాంక బయటకు వచ్చింది. వచ్చీ రాగానే జెస్సీని ముద్దులతో ముంచెత్తింది. ర్యాలీ ఏర్పాటు చేసిన ప్రియాంకకు ఘన స్వాగతం పలికినట్టున్నాడు జెస్సీ. అందరి ముందే బహిరంగంగా బరితెగించినట్టుగా ముద్దులుపెట్టేసింది ప్రియాంక. వచ్చిందండి వయ్యారి అంటూ ప్రియాంక తనకు ముద్దు పెట్టిన ఫోటోను షేర్ చేశాడు జెస్సీ.

    Leave a Reply