• November 27, 2021

Bigg Boss 5 Telugu : తప్పు తెలుసుకుంటాడా? లేదా?.. రవికి సుతి మెత్తగా చెప్పిన నిత్య!

Bigg Boss 5 Telugu : తప్పు తెలుసుకుంటాడా? లేదా?.. రవికి సుతి మెత్తగా చెప్పిన నిత్య!

    Bigg Boss 5 Telugu బిగ్ బాస్ ఇంట్లో రవి వేరు.. మనం బయట చూసే రవి వేరు. బిగ్ బాస్ షో కంటే ముందు రవి మీద కొన్ని ఆరోపణలు ఉండేవి. కెరీర్ కోసం పర్సనల్ విషయాలను కూడా దాచి పెట్టాడు. అబద్దామాడాడు అంటూ రకరకాలుగా ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. అయితే దాచి పెట్టడం, అబద్దాలు ఆడటం రవి సహజ శైలిలా అనిపిస్తోంది. బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాక ఎన్నో సార్లు రవి అడ్డంగా బుక్కయ్యాడు.

    తాను అన్ని మాటలు అంటాడు.. మళ్లీ అనలేదు అని బుకాయిస్తాడు. పైగా ఒట్టేసి చెబుతుంటాడు. అలా ఎన్నో సార్లు రవి అడ్డంగా దొరికిపోయాడు. అయినా కూడా రవి తనని తాను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో హోస్ట్ నాగార్జున కూడా చేతులెత్తేశాడు. నేను చెప్పాల్సింది నేను చెప్పేశాను.. ఇక నీ ఇష్టం.. వీటిని ఎంత లాగితే అంత దొరికిపోతావ్ రవి అని ఎన్నో సార్లు వార్నింగ్ ఇచ్చాడు.

    అలా రవికి మొదటగా దెబ్బ పడింది లహరి విషయంలో. ఆ తరువాత శ్వేతా వర్మ టాస్క్‌లో మరోసారి దొరికిపోయాడు. ఇలా ప్రతీ సారి రవి అబద్దాలు ఆడటంతో ఆయన మీద ఫుల్ నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. మరొకరు అయితే ఈ పాటికి ఎలిమినేట్ అవుతారు. కానీ రవికి ఉన్న ఫ్యాన్ బేస్, గట్టి పీఆర్ టీం వల్లే ఇంకా బిగ్ బాస్ ఇంట్లో ఉండగలుగుతున్నాడు.

    అయితే రవికి ఎక్కడ మైనస్ అయిందో గుర్తించిన నిత్య.. వాటిని సరి చేసే ప్రయత్నం చేసింది. కానీ రవి మాత్రం ఆ పాయింట్‌ను క్యాచ్ చేశాడా? అన్నది చూడాలి. ఎప్పుడైనా ఏదైనా మాట అంటే.. గుర్తు లేకపోతే గుర్తు లేదని చెప్పు.. దాన్ని వివరించే ప్రయత్నం చేయకు.. వదిలేయ్ అంటూ చెప్పింది నిత్య. నిజంగా ఆమె మాటలను పాటిస్తే.. ఇక ముందు రవి అబద్దాలు ఆడాల్సిన పని రాదు. ఇక అడ్డంగా బుక్కయ్యే పరిస్థితి రాదు.

    Leave a Reply