• November 18, 2021

Bigg Boss 5 Telugu : సన్నీతో వచ్చిన ప్రాబ్లమిదే.. చెబితే వినడు కోపం వస్తే ఆగడు!

Bigg Boss 5 Telugu : సన్నీతో వచ్చిన ప్రాబ్లమిదే.. చెబితే వినడు కోపం వస్తే ఆగడు!

    బిగ్ బాస్ ఇంట్లో సన్నీది వింత కారెక్టర్. టాప్ 5 లో ఉండాల్సిన కంటెస్టెంట్. అందులో ఎలాంటి సందేహం లేదు. మరీ ముందుకు వెళ్తే.. టాప్ 2లో కూడా ఉండాల్సిన వాడే. అయితే సన్నీలో మైనస్ అతని కోపం. ఆ కోపంలోంచి వచ్చే మాటలు. కోపం కట్టలు తెంచుకుంటే తన మీద తనకు కంట్రోల్ పోతుంది. అదే వచ్చిన సమస్యల్లా. టాస్కుల స్వరూపం ఏంటి? అక్కడ పరిస్థితి ఏంటి? ఎవరిపై అరవాలి.. ఎవరిపై అరవకూడదు.. ఓడిపోతే స్వీకరించడం, తప్పును ఒప్పుకోకపోవడమే సన్నీకి సమస్యలు.

    నిన్నటి స్విమ్మింగ్ పూల్ టాస్క్‌లో సన్నీ ఆవేశాన్ని ప్రదర్శించాడు. ఆలోచనను పక్కన పెట్టేశాడు. సరిగ్గా టీ షర్ట్ ధరించాలి అని చెప్పాడు. అదొక్కటి చాలు. మనం టీ షర్ట్‌లు ధరిస్తే.. వెనకా ముందు చూసుకుని వేసుకుంటాం.. ఎలా పడితే అలా వేసుకోం. లేబుల్ ఉన్నా లేకపోయినా సంబంధం లేదు. టీ షర్ట్ సరిగ్గా ధరించడం.. సరిగ్గా అనే మాటలోనే అంతా ఉంది. రవి చెప్పిన మాటలు రైటే. అందుకే కదా? మానస్ కాస్త ఆలస్యమైనా పర్లేదు అని మొదటి నుంచి టీషర్ట్ ఒకటికి రెండు సార్లు చూసుకుని వేసుకున్నాడు.

    టాస్క్ స్వరూపాన్ని, ఆడే విధానాన్ని అర్థం చేసుకోక.. గుడ్డెద్దు చేలో పడ్డట్టు స్విమ్మింగ్ పూల్‌లో దూకేశాడు. ఆడేశాడు. టాస్కులో కష్టపడ్డాను.. అంటే.. అందరూ కష్టపడతారు. చివరకు కాజల్ వివరించే ప్రయత్నం చేసినా కూడా వినలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం టీషర్ట్ కరెక్ట్‌గా ఉందా? లేదా? అని చూసుకుని ధరించాలి.. అని కాజల్ చెబితే.. సన్నీ ఫైర్ అయ్యాడు. మీరు కూడా నాదే తప్పు అంటే ఎలా అని స్నేహితుల మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు.

    ఒక్కసారి కామ్ అయి.. అసలు కథ ఏంటి? రూల్ ఏంటి? అని ఆలోచిస్తే అర్థమవుతుంది. టీషర్ట్ ధరించడం అంటే ఎలాగైనా ధరించొచ్చు. సరిగ్గా ధరించాలి అని చెప్పినప్పుడు.. ఉల్టా పల్టా ధరిస్తే అది ఎలా కౌంట్ అవుతుందని సన్నీ అర్థం చేసుకోలేకపోతోన్నాడు. కోపంలో ఉన్నప్పుడు సన్నీ ఇలా తన ఆలోచనాశక్తిని కోల్పోతాడు. అదే సన్నీకి ఉన్న ప్రాబ్లం. మిగతా సమయంలో అందరినీ ఎంటర్టైన్ చేసి ఇలాంటి సమయంలో తనకున్న ఇమేజ్‌ను డ్యామేజ్ చేసుకుంటున్నాడు.

    Leave a Reply