• November 14, 2021

Bigg Boss 5 Telugu : నీ బొందరా నీ బొంద!.. నాగ్ హోస్టింగ్‌పై మాధవీలత సంచలన కామెంట్స్

Bigg Boss 5 Telugu : నీ బొందరా నీ బొంద!.. నాగ్ హోస్టింగ్‌పై మాధవీలత సంచలన కామెంట్స్

    బిగ్ బాస్ హోస్ట్ అంటే అన్ని వైపుల నుంచి ఆలోచించాలి. తప్పు ఎవరిది? ఎక్కడ మొదలైంది? ఎవరు మొదలుపెట్టారు.. ఎందుకు ఆ గొడవ మొదలైంది? ఎవరు మూల కారణం ఇలా ప్రతీ ఒక్క విషయాన్ని క్షణ్ణంగా పరిశీలించాలి. అప్పుడు హోస్ట్‌గా సక్సెస్ అయినట్టు. అంతే కానీ స్క్రిప్ట్ ప్రకారం చదివేసి వెళ్లిపోవడం హోస్ట్ కానే కాదు. మన హోస్ట్ నాగార్జున మాత్రం చేసేదే అది. స్క్రిప్ట్ ప్రకారం వెళ్తుంటాడు. ఆ బిగ్ బాస్ టీం అయితే తాము అనుకున్నదే చేస్తుంది. తమ డియరెస్ట్ కంటెస్టెంట్లకు అనుగుణంగానే ప్రవర్తిస్తుంది బిగ్ బాస్ టీం.

    ఆ టీం ఇచ్చిన స్క్రిప్ట్‌ ప్రకారం నాగార్జున రెచ్చిపోతాడు. కానీ అసలు మూల కారణం ఏంటి? ఎందుకు సమస్య తలెత్తింది అనే విషయాన్ని, దానికి వెనుకున్న ఉద్దేశ్యాన్ని పరిశీలించలేదు ఎప్పుడూ. అయితే నిన్న సన్నీ విషయంలో నాగార్జున పక్షపాత ధోరణి కనబరిచాడు. దోషమంతా కూడా సన్నీదే అన్నట్టుగా నాగార్జున చిత్రీకరించాడు. కొన్ని పదాలు తూలాడేమో సన్నీ.. కానీ వాటి ఉద్దేశ్యాన్ని స్వయంగా చెబుతూ ఉంటే కూడా కాదంటున్నాడు నాగ్.

    పదే పదే తప్పు తప్పు.. అని చెప్పేస్తే సన్నీ మాత్రం ఏం చేయగలడు. తన ఉద్దేశ్యం అది కాదు మొర్రో అని మొత్తుకున్నాడు. తంతా అన్నది బ్రిక్స్‌ను, సిరిని కాదు.. అంటూ ఉంటే వినడే. మిగతా కంటెస్టెంట్లు కూడా సన్నీదే తప్పు అనేశారు. కాజల్, ఆనీ మాస్టర్లు ఆ విషయంలో సన్నీ అండగా నిలిచారు. అయితే తాజాగా ఈ హెస్టింగ్ మీద మాధవీలత స్పందించింది. మామూలుగానే ఇలాంటి వాటి మాధవీలత నిర్భయంగా తన అభిప్రాయాలను చెబుతుంటుంది.

    జడ్జ్, హోస్ట్ అంటే అన్ని వైపుల నుంచి ఆలోచించాలి.. నేరం చేయడం కంటే.. నేరం చేయడానికి ప్రేరేపించిన కారణాలు కూడా ముఖ్యం. వాటికే ఎక్కువ శిక్ష వేయాలి. బుద్దిలేని జడ్జ్ పోస్ట్‌లో నాగార్జున.. డబ్బు లేని సన్నీ. మాట్లాడటం చేతగాని లాయర్ మానస్.. జూనియర్ లాయర్ కాజల్ పాయింట్ బాగా చెప్పినా.. జడ్జ్ బెదిరింపుకి పక్కకి తప్పుకుంది.. కేస్ ఓడిపోయారు. ఈ రోజు వరకు సన్నీ ఒక్కడే ఎవ్వరి గురించి బ్యాక్ బిచింగ్ చేయలేదు.. గతంలోనూ ఇలానే కౌశల్‌ని కూడా టార్గెట్ చేశారు.ఇప్పుడు సన్నీ. అప్పుడు నాని బెటర్ హోస్ట్. హౌస్ మొత్తం సన్నీ గిల్టీ. అడియన్స్ మాత్రం హీరో బోర్డ్ చూపించారు. అలా మొత్తానికి చెత్త హోస్టింగ్ నాగ్ జీ.. మీకొక డైలాగ్.. నీ బొందరా నీ బొంద లా ఉంది మీ జడ్జ్మెంట్. అని మాధవీలతా కౌంటర్లు వేసింది.

    Leave a Reply