- November 10, 2021
Bigg Boss 5 Telugu : రవితో ఇంకా శత్రుత్వం ఉంది!.. వారికి ఓటు వేయమన్న లాస్య
Bigg Boss 5 Telugu యాంకర్ రవి, లాస్య మధ్య ఉన్నగొడవలు అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ఇంట్లో లాస్య ఉన్నప్పుడు ఎక్కడా కూడా రవి ఆమెకు సపోర్ట్ ఇవ్వలేదు. టాప్ 5లో ఉంటుందని కూడా చెప్పలేదు. అయితే లాస్య బయటకు వచ్చాక అనూహ్య మార్పులు వచ్చాయి. రవి, లాస్యలు కలిసి ఈవెంట్లు చేశారు.. షోలకు హోస్ట్‌లుగా పని చేశారు. కామెడీ స్టార్స్ షోలో కొన్ని రోజులు నానా హంగామా చేశారు. పాత శత్రుత్వాన్ని మరిచిపోయి స్క్రీన్ మీద బాగానే రొమాన్స్ చేశారు.
ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా బాగానే కలిసి పోయారు. ఇద్దరూ కలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్లను కూడా నడిపించారు. అలా వీరిద్దరి మధ్య శత్రుత్వం సమసిపోయిందని అంతా అనుకున్నారు. మునుపటిలా కలిసి ఉన్నారని అనుకున్నారు. కానీ లాస్యకు మాత్రం ఇంకా లోపల ఓ బాధ ఉన్నట్టు కనిపిస్తోంది. బిగ్ బాస్ ఇంట్లో తాను ఉన్నప్పుడు రవి సపోర్ట్ చేయలేదని లాస్యకు ఫీలింగ్ ఉన్నట్టుంది. అందుకే ఈ వారం మాత్రం లాస్య తన మద్దతు రవికి ఇవ్వడం లేదు.
ఈ పదో వారంలో రవి, కాజల్, మానస్, సన్ని, సిరి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. లాస్య మాత్రం కేవలం సన్నీ, కాజల్‌లకు ఓటు వేయండని పెట్టేసింది. సన్నీ, కాజల్‌కు తాను సపోర్ట్ చేస్తున్నానని చెప్పకనే చెప్పేసింది. సన్నీ, కాజల్ ఫోటోలను, ఓట్లు వేసే నంబర్లను, హాట్ స్టార్ లింకులను లాస్య తన ఇన్ స్టా స్టోరీలో పెట్టేసుకుంది. మొత్తానికి లాస్య మాత్రం ఇంకా పాత విషయాలను మరిచిపోలేనట్టు కనిపిస్తోంది.
అయితే ఆట నచ్చింది కాబట్టి వీళ్లకు మద్దతు ఇస్తున్నాను అని లాస్య కప్పిపుచ్చుకోవచ్చు. ఆటను ఆధారంగా చేసుకుని మద్దతు ఇస్తాను.. కానీ ఫ్రెండ్స్ కదా? అని సపోర్ట్ చేయలేను అని కూడా తప్పించుకోవచ్చు. కానీ లాస్య మనసులో ఏముందో ఆమెకే తెలియాలి.