• November 14, 2021

Bigg Boss 5 Telugu : హోస్ట్‌కే ఎదురెళ్లింది.. మొదటిసారిగా కాజల్ నచ్చేసింది!

Bigg Boss 5 Telugu : హోస్ట్‌కే ఎదురెళ్లింది.. మొదటిసారిగా కాజల్ నచ్చేసింది!

    బిగ్ బాస్ ఇంట్లో కాజల్ ఆత్రం గురించి అందరికీ తెలిసిందే. ప్రతీ దానికి అతి చేయడమే పరమావధిగా పెట్టుకుని వచ్చినట్టుంది. గతంలో బిగ్ బాస్ రివ్యూలు ఇచ్చేది. అప్పుడు ప్రతీ ఒక్కరినీ తన స్టైల్లో విమర్శించేది. అయితే ఇప్పుడు అవే విమర్శలు కాజల్‌కు వస్తున్నాయి. అయితే విమర్శించడం వేరు.. పరిస్థితులను అనుభవించడం వేరు. మొత్తానికి కాజల్‌ మీద ఇన్ని రోజులు నెగెటివిటీనే ఏర్పడింది. అయితే ఆమె అదృష్టం బాగుంది. ఈ వారం సేఫ్ అయింది. లేదంటే బయటకు వచ్చేసేది.

    జెస్సీని అనారోగ్య కారణాలతో బయటకు పంపించారు. దాంతో కాజల్ సేఫ్ అయింది. అయితే మొదటిసారిగా కాజల్ అందరికీ నచ్చేసింది. ఎందుకంటే హోస్ట్‌కు వ్యతిరేకంగా నిలబడటం, ధైర్యంగా తాను అనుకున్న వాటిని మాట్లాడటం, తాను నమ్మినదాని కోసం పోరాడటం వంటివి కాజల్‌లో కనిపించాయి. సన్నీ తప్పు చేశాడని నాగార్జున అంటే.. లేదు, కాదు అంటూ సన్నీ తరుపున కాజల్ వాదించింది. ఓ రకంగా నిలదీసింది.

    ఇక కాజల్ అలా నిలదీస్తుంటే.. హెస్ట్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. దెబ్బకు అరిచేశాడు. పాయింట్లు మాట్లాడేందుకు లేక.. నిన్ను అమ్ముతాను అని అనడం కరక్టేనా? అని మాత్రమే నాగ్ పట్టుకున్నాడు. అప్పటికీ కాజల్ దాన్ని వాదించేందుకు చూసింది. నిన్ను అంటే అక్కడ అప్పడమే కదా? అని అంది. కానీ నాగ్ పదే పదే.. నిన్ను అమ్మడం అంటే కరెక్టేనా? అని అనడంతో అది మాత్రం తప్పే సర్ అని కాజల్ వెనక్కి తగ్గింది.

    నిన్ను ఆనీ మాస్టర్ ఫాల్తూ గేమ్ అన్నందుకు నువ్ అంత ఫీల్ అయ్యావ్.. నీ గేమ్‌ను అంది.. నిన్ను అనలేదు.. కానీ నువ్ ఫాల్తూ గేమ్ అన్నందుకు అన్ని మాటలు అన్నావ్.. మరి నిన్ను అమ్మేస్తాను అంటే సిరి ఎంత ఫీల్ అయి ఉంటుంది అని లాజిక్ తీశాడు నాగ్. నేను ఆనీ మాస్టర్‌ను ఏం అనకుండానే నన్ను అంది కానీ అక్కడ సిరి అప్పడాలు అమ్ముకో అని అనడంతో.. అలా సన్నీ అన్నాడు అని కాజల్ వాదించేందుకు ప్రయత్నించింది. కానీ చివరకు కాజల్ నోర్మూయించాడు నాగ్. ఏది ఏమైనా ధైర్యమున్న పిల్లలా మార్కులు కొట్టేసింది. కాకపోతే ఆ వెకిలి నవ్వు, ఎప్పుడూ ఏదో చేసేద్దామనే ఆలోచనలు, ఆ అతి, ఆ ఆత్రం తగ్గించుకుంటే చివరి వరకు నిలబడగలుగుతుంది.

    Leave a Reply