- November 13, 2021
Bigg Boss 5 Telugu: అనుకున్నదే జరిగింది.. జెస్సీ బయటకు.. కాజల్ సేఫ్!

Bigg Boss 5 Telugu బిగ్ బాస్ ఇంట్లో ఒక్కోసారి అనుకున్నదే జరుగుతుంది. ఈ పదో వారం అసలు సిసలైన కంటెస్టెంట్లు నామినేషన్లోకి వచ్చారు. కాజల్, మానస్, సన్ని, సిరి, రవి నామినేట్ అయ్యారు. అయితే ఈ వారం ఎలిమినేషన్ ఉండదు అని మనం ముందే చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ అయినా కూడా ఆటలో పస ఉండదు.
అయితే ఎలిమినేషన్ ఎవరిని చేయాలి? అని అనుకున్న సమయానికి సరిగ్గా జెస్సీ తగిలాడు. అతని ఆరోగ్యం బాగా లేదన్న సాకుతో బిగ్ బాస్ అతడిని బయటకు పంపించేశాడు. ఇంట్లోని కంటెస్టెంట్లకు జెస్సీ సీక్రెట్ రూంలో ఉన్నాడన్న విషయం తెలీదు. కానీ చూసే ప్రేక్షకులకు తెలుసు. అలా మొత్తానికి అనారోగ్య కారణాలతో జెస్సీని బయటకు పంపించేశారు.
Bigg Boss 5 Telugu : ఈ వారం జరిగేది ఇదేనా?.. అయితే ఓట్లు వేసే వాళ్లు బక్రాలే!
జెస్సీ బయటకు రావడంతో ఈ వారం కాజల్ సేఫ్ అయింది.లేదంటే ఈపాటికి కాజల్ బయటకు వచ్చేది. మొత్తానికి ఈ వారం ఓట్లు వేసిన వారిని పిచ్చోళ్లను చేసేశాడు బిగ్ బాస్. గత సీజన్లలోనూ ఇలాంటి గిమ్మిక్కులు బిగ్ బాస్ చేస్తూనే వస్తున్నాడు. గత నాలుగో సీజన్లో గంగవ్వ, నోయల్ కూడా ఇలానే బయటకు వెళ్లిపోయారు. ఇప్పుడు జెస్సీ బయటకు వచ్చాడు. కాజల్ బతికిపోయింది.